ప్రజా వ్యతిరేకతతో ప్రతిపక్షానికే పరిమితమైన తెలుగుదేశం పార్టీ జిల్లాలో పిల్లిమొగ్గలు వేస్తోంది. అధికారం కోల్పోయినా ఆధిపత్య పోరులో మాత్రం తెలుగు తమ్ముళ్లు ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ఇటీవలే టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారం రోజుల పాటు అలకపాన్పు ఎక్కినట్టే ఎక్కి ఒక్కసారే కిందకు దిగిపోయారు.