Jul 26,2021 06:25
తాను మనిషిగా పుట్టినా స్త్రీగా తయారు చేయబడుతూందన్న సామాజిక, శారీరక స్పృహ ఈనాటి స్త్రీలో కలిగింది. తన శరీరం చుట్టూ పురుషస్వామ్య వ్యవస్థ ఏర్పరచిన రాజకీయ భావజాలాన్ని ఛేదించుకుని ఒక మనిషిగా రూపుదిద్దుకుంటూంది నేటి మానవి. తనను ఒక మనిషిగా కాక, మని + షిగా చూస్తున్న సమాజాన్ని ప్రశ్నిస్తూంది. మానవతావాద ప్రతిఫలనాలైన స్వేచ్ఛా సమానత్వాల కోసం పోరాడుతూంది. తింటున్�