నాసిరకం విత్తనాల దందా రాష్ట్రం నలుమూలలా మాఫియా తరహాలో అల్లుకుపోయిందని రెండు నెలలుగా టాస్క్‌ఫోర్స్ బృందాలు జరుపుతున్న తనిఖీల్లో స్పష్టమవుతోంది. కొందరు వ్యాపారులు, చిన్న విత్తన కంపెనీల యజమానులే కాకుండా, పెద్ద కంపెనీల ఉద్యోగులు కూడా లోపాయికారీగా వీటి అమ్మకాలకు సహకరిస్తున్నారు. పదేపదే అదే దందా