అత్యాచారం జరగలేదు అక్కాచెల్లెళ్లు తప్పుడు సమాచారం ఇచ్చారు : సిపి అంజనీకుమార్
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : హైదరాబాద్‌లో సంచలనం రేపిన రెండు సామూహిక లైంగిక దాడుల కేసులను పోలీసులు ఛేదించారు. గాంధీ ఆస్పత్రి, సంతోష్‌నగర్‌లో జరిగిన ఈ ఘటనలు వాస్తవం కాదని, బాధితులుగా పేర్కొన్న మహిళలే కట్టుకథ అల్లినట్టు తేల్చారు.