1955లో మన రాష్ట్రంలో జరిగిన నడమంత్రపు ఎన్నికల (మధ్యంతర ఎన్నికలకు శ్రీశ్రీ పెట్టిన పేరు) గురించి ఇప్పుడు 75 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న రెండు తరాలకు తెలియదు. ఆంధ్రరాష్ట్రానికి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా కర్నూలు రాజధానిగా 1953లో ఏర్పడిన మంత్రివర్గ శాసనసభ విశ్వాసం కోల్పోవటంతో 1954 నవంబర్ 6న రాజీనామా చేసింది. కమ్యూనిస్టు పార్టీకి ఆనాటి శాసనసభలో నాయకునిగా ఉన్న తరిమెల నాగిరె�