చెన్నై : ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు సిద్ధమైంది తమిళనాడులోని డిఎంకె ప్రభుత్వం. ఇప్పటికే పెట్రోల్‌పై రూ. 3 తగ్గించిన సర్కార్, శనివారం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర అసెంబ్లీలో శనివారం వ్యవసాయ రంగం కోసం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వ్యవసాయం నిమిత్తం ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఇందులో వ్యవసాయ రంగం సమగ్ర అభివృద్ధ