comparemela.com


Jul 24,2021 06:15
ఉత్తరప్రదేశ్‌ లో ఎస్సీ, ఎస్టీలలో సంతానోత్పత్తి రేటు అధికంగా ఉంది కాబట్టి ఈ బిల్లు రిజర్వేషన్లపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది చట్టం అయి అమలులోకి వచ్చిన తర్వాత, మూడవ బిడ్డకు జన్మనిచ్చిన వారికి ఇళ్ళు, విద్య, అనేక సామాజిక భద్రతా పథకాలు నిరాకరించబడతాయి. అంటే మూడవ బిడ్డకు అంగన్‌ వాడీ కేంద్రానికి, లేక మధ్యాహ్న భోజన పథకంలో ప్రవేశం వుండదు. కేవలం నలుగురు సభ్యులకు మాత్రమే సబ్సిడీ రేషన్‌ ఇవ్వాలనే ఒక ప్రత్యేక సబ్‌ క్లాజ్‌ వలన .... ఎటువంటి నియమ నిబంధనలు లేని ఆహార భద్రతా చట్టం ఉల్లంఘనకు గురవుతుంది. ప్రస్తుతం అమలులో వున్న ఏ ఇతర చట్టాన్నైనా తిరస్కరించే ఒక క్లాజ్‌ కూడా వుంది. పార్లమెంట్‌ ఆమోదించిన ఒక జాతీయ చట్టం ద్వారా లబ్ధి పొందే అవకాశమున్న పౌరులను ఒక రాష్ట్ర ప్రభుత్వం అనర్హులను చేయవచ్చా?
ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రపంచ జనాభా దినోత్సవం నాడు (జులై 11) 'యు.పి జనాభా నియంత్రణ విధానం 2021-2022' విడుదల చేశారు. ఇద్దరు పిల్లలకు మాత్రమే జన్మనివ్వాలనే నియమం పాటించిన వారికి ప్రోత్సాహకాలు, పాటించని వారికి జరిమానాలు విధించే బలవంతపు చర్యల గురించి విన్నవారంతా ఆశ్చర్యపోయారు. జనాభా నియంత్రణకు ఒక సహేతుకమైన విధానాన్ని అనుసరించడానికి బదులు, తల్లీపిల్లల హక్కులను నిరాకరించే చట్టాన్ని అమలు చేయడానికి యోగి పూనుకున్నారు. భారత్‌ లాంటి దేశంలో జనాభా నియంత్రణ చర్యలు వద్దని ఎవరూ అనరు. కానీ నియంత్రణ బిల్లులో పొందుపరిచిన బలవంతపు చర్యలు మహిళల హక్కులను కాలరాసేలా వున్నాయి.
యోగి ఆదిత్యనాథ్‌ ప్రపంచ వ్యాప్తంగా జనాభాకు సంబంధించి జరిగిన చర్చల గురించి కూడా మాట్లాడారు. 1994లో 'జనాభా మరియు అభివృద్ధి'పై కైరో లో జరిగిన అంతర్జాతీయ మహాసభ, ''అభివృద్ధే ఉత్తమమైన సంతాన నియంత్రణా సాధనం'' అనే నినాదాన్ని ఇచ్చింది. కాబట్టి యోగి ఈ మహాసభ గురించి మాట్లాడాలి. ఆ నినాదాన్ని భారతదేశంతో పాటు 179 దేశాలు అంగీకరించి, సంతకాలు కూడా చేశాయి. ప్రోత్సాహకాలు, జరిమానాలు జనాభా స్థిరీకరణలో చాలా పరిమితమైన పాత్రనే పోషిస్తాయి. వాటి స్థానంలో ప్రజల్లో అవగాహన కల్పించి, వారే స్వచ్ఛందంగా సంతాన స్థిరీకరణలో భాగస్వామ్యం అయ్యే విధానాన్ని వాజ్‌పేయి ప్రభుత్వం 'జాతీయ జనాభా విధానం 2000'లో తీసుకుంది. 2019 లో నైరోబి లో జరిగిన ప్రపంచ జనాభా మహాసభలో, ప్రజలు స్వచ్ఛందంగా, తమకున్న అవగాహన తోనే సంతాన నియంత్రణకు హామీ ఇచ్చే విధానాన్ని భారతదేశం మరొకసారి నొక్కి వక్కాణించింది. సుప్రీంకోర్టులో నడుస్తున్న ఒక పిటిషన్‌ విషయమై ''ప్రభుత్వ ఉద్యోగాలను, సబ్సిడీలను నిరాకరించడం ద్వారా 'ఇద్దరు పిల్లలకే పరిమితం కావాలనే ఆదేశాలను' అమలు చేయబోమని'' కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల తన అఫిడవిట్‌లో పేర్కొంది. 'ఉత్తరప్రదేశ్‌ జనాభా నియంత్రణ బిల్లు-2021'ని పౌరుల హక్కులపై చేసే ఒక పాశవిక దాడి అని, ఇది 'మైనారిటీ వ్యతిరేక' బిల్లు అని, రేపు యు.పి లో జరగబోయే ఎన్నికల్లో ప్రజలను విభజించేందుకు చేసే కుట్రలో భాగమే ఈ బిల్లని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ బిల్లును ఒకసారి పరిశీలిస్తే...పేదలు, మహిళలు, పిల్లలకు హక్కులను ఇది నిరాకరిస్తుంది. దురదృష్టవశాత్తు, అనేక రాజకీయ పార్టీలు తమ పాలనా కాలంలో శిక్షల ద్వారానే జనాభా నియంత్రణా చర్యలను అమలు చేశాయి.
భారీ అసమానతలు పెరిగిన నయా ఉదారవాద సంస్కరణల కాలంలో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా కల్పించిన హక్కులను ఈ బిల్లు నిరాకరిస్తుంది. చాలా కాలంగా...సామాజిక, ఆర్థిక సూచికలైన పేదరికం, ఆరోగ్యం, అక్షరాస్యత, శిశు మరణాలతో ముడిపడి సంతానోత్పత్తి రేటు వుంటోంది. 'జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే' ప్రకారం, సంతానోత్పత్తి రేటు షెడ్యూల్డ్‌ తెగలు, దళితులు, ముస్లింలు, ఓబీసీ ల లాంటి సామాజిక వర్గాల్లోనే అధికంగా వుంది. ఆ వర్గాలకు చెందిన తక్కువ ఆదాయం కలిగిన మహిళల్లో సంతానోత్పత్తి రేటు అధికంగా వుంది. సామాజికంగా అణచివేతకు గురవుతున్న ఈ పేదలనే, ఈ జనాభా నియంత్రణ బిల్లు శిక్షిస్తుంది.
ఈ బిల్లు లోని 8వ క్లాజ్‌ మరియు దానిలో ఉన్న అనేక సబ్‌ క్లాజ్‌ లు, ఇద్దరు పిల్లలకు మాత్రమే జన్మనివ్వాలనే నియమాన్ని పాటించని వారికి ఒకరకంగా చెప్పాలంటే శిక్ష వేస్తున్నాయి. వారు అన్ని రకాల ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందే అవకాశం లేకుండా, ప్రభుత్వ ఉద్యోగాలు, ఉద్యోగాల్లో పదోన్నతులను కూడా నిరాకరించడం ద్వారా కార్మిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ లో ఎస్సీ, ఎస్టీలలో సంతానోత్పత్తి రేటు అధికంగా ఉంటుంది కాబట్టి ఈ బిల్లు రిజర్వేషన్లపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది చట్టం అయి అమలులోకి వచ్చిన తర్వాత...మూడవ బిడ్డకు జన్మనిచ్చిన వారికి ఇళ్ళు, విద్య, అనేక సామాజిక భద్రతా పథకాలు నిరాకరించబడతాయి. అంటే మూడవ బిడ్డకు అంగన్‌ వాడీ కేంద్రానికి, లేక మధ్యాహ్న భోజన పథకంలో ప్రవేశం వుండదు. కేవలం నలుగురు సభ్యులకు మాత్రమే సబ్సిడీ రేషన్‌ ఇవ్వాలనే ఒక ప్రత్యేక సబ్‌ క్లాజ్‌ వలన...ఎటువంటి నియమ నిబంధనలు లేని ఆహార భద్రతా చట్టం ఉల్లంఘనకు గురవుతుంది. ప్రస్తుతం అమలులో వున్న ఏ ఇతర చట్టాన్నైనా తిరస్కరించే ఒక క్లాజ్‌ కూడా వుంది. పార్లమెంట్‌ ఆమోదించిన ఒక జాతీయ చట్టం ద్వారా లబ్ధి పొందే అవకాశమున్న పౌరులను ఒక రాష్ట్ర ప్రభుత్వం అనర్హులను చేయవచ్చా? ఈ మధ్యే ఢిల్లీలో, ఢిల్లీ ప్రభుత్వం, రేషన్‌ ను ఇంటింటికి వెళ్ళి ఇచ్చే ఒక పథకాన్ని ప్రతిపాదించినపుడు, ఇది ఆహార భద్రతా చట్టానికి వ్యతిరేకం అని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. మరి ఇప్పుడు ఆహార భద్రతా చట్టానికి వ్యతిరేకంగా పిల్లల రేషన్‌లో కోత విధించే ఈ 'జనాభా నియంత్రణ బిల్లు ప్రతిపాదన' విషయంలో కేంద్రం ఎందుకు మౌనం వహిస్తోంది? ఇలాంటి విధానాలు ఆకలి, పౌష్టికాహార లోపం, శిశు మరణాల రేటును తీవ్రంగా పెంచడానికి దారితీస్తాయి. పుట్టిన బిడ్డను ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎలా శిక్షిస్తుంది?
చారిత్రకంగా అన్ని జనాభా నియంత్రణ విధానాలు, మహిళల శారీరక నియంత్రణ, వారి పునరుత్పత్తి హక్కుల నిరాకరణ పైనే కేంద్రీకరించాయనే విషయం మనకు తెలిసిందే. మగ పిల్లల ప్రాధాన్యతా సంస్కృతికి తోడు లింగ నిర్ధారణ పరీక్షలు, ఆడపిల్లలు పుట్టకుండా గర్భస్రావాలు చేయించడం ద్వారా భారతదేశంలో పితృస్వామిక విశ్వాసాలు బలపడతాయి. ఉత్తరప్రదేశ్‌ లో లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు, కేవలం 903 మంది స్త్రీలు ఉండగా, కేరళలో 1047, తమిళనాడులో 954 మంది స్త్రీలు వున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలకు మాత్రమే జన్మనివ్వాలనే నియమాన్ని విధించడమంటే, గర్భిణీ స్త్రీలు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, పుట్టబోయేది అమ్మాయని తేలితే, అబ్బాయి కోసం గర్భ స్రావం చేయించుకునే పరిస్థితి దాపురిస్తుంది. నియంత్రించవలసింది మహిళల సంతానోత్పత్తిని కాబట్టి, 'జనాభా నియంత్రణా చర్యలు' మహిళలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.
గతంలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హతగా 'ఇద్దరు పిల్లల' నియమాన్ని విధిస్తూ చట్టాలను అమలు చేసినప్పుడు ప్రతికూల ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది. ఆ సమయంలో ముగ్గురు పిల్లలు వున్నారనే కారణంతో అనేక మందిని ఎన్నికల్లో అనర్హులుగా పోటీ నుంచి తప్పించాయి. 21 జిల్లాలకు గాను, ఐదు జిల్లాల్లో 'ఇద్దరు పిల్లల' నిబంధనను అమలు చేయడంతో పాటు, 54 శాతం మందిని కేవలం ప్రాథమిక విద్య, లేదా నిరక్షరాస్యత కారణం చూపి అనర్హులుగా ప్రకటించారు. అనర్హులలో 78 శాతం మంది, జనాభాలో సామాజికంగా బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు వున్నారు. వారిలో సగం మందికి పైగా రూ.20 వేల కన్నా తక్కువ సంవత్సరాదాయాన్ని కలిగి ఉన్నారు. మహిళలపై ప్రభావం చూపుతుందన్న కారణంగా, మహిళా సంఘాలు ఇటువంటి చట్టాలను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్తే, కోర్టు కూడా ఆ చట్టాలను సమర్థించడం విడ్డూరం.
ప్రభుత్వోద్యోగులకు పదోన్నతులు, వడ్డీ లేని రుణాల లాంటి ప్రోత్సాహకాలను (ఉద్యోగి లేదా అతని భార్య/ఆమె భర్త) ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత గర్భ నిరోధక ఆపరేషన్‌ చేయించుకునే నిబంధనతో మాత్రమే అందజేస్తారు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత అయితే ప్రోత్సాహకాలను పెంచుతారు. అంటే దీనివల్ల మహిళలు మాత్రమే గర్భ నిరోధక ఆపరేషన్‌ చేయించుకునే విధంగా వారిపై ఒత్తిడి పెరుగుతుంది. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ 2017-18 నివేదిక ప్రకారం భారతదేశంలో 93.1 శాతం మహిళలు గర్భ నిరోధక ఆపరేషన్‌ చేయించుకున్నారంటే మహిళలపై ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే-5 నివేదిక దాదాపు అన్ని రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గినట్టు తెలియజేస్తుంది. 2006 నుండి 2016 మధ్య కాలంలో హిందూ కుటుంబాల్లో సంతానోత్పత్తి రేటు 2.6 నుండి 2.1 కు, ముస్లిం కుటుంబాల్లో 3.4 నుండి 2.6 కు తగ్గిందని ఒక నివేదిక తెలిపింది. అస్సాం లో ముస్లిం మహిళల సంతానోత్పత్తి రేటు 3.7 నుండి 2.4 కు పడిపోగా, ఇప్పుడు ఆ రాష్ట్రంలో ముస్లిం జనాభా పెరుగుతుందని, దానిని నియంత్రించడానికి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం జనాభా నియంత్రణ సైన్యాన్ని వినియోగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ బిస్వా శర్మ చెప్తున్నారు. దేశంలో జనాభా పెరుగుదలకు మూల కారణం ముస్లింలనీ, సంఫ్‌ు పరివార్‌ శక్తులు ముస్లింలకు వ్యతిరేకంగా తమ రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించాయి. దేశ ప్రగతికి ముస్లింలు అవరోధంగా వున్నారనీ, వారు అవకాశమున్న ప్రతీ చోటా విషం కక్కుతున్నారు.
భారతదేశాన్ని మింగుతున్న సంక్షోభానికి మూల కారణం జనాభాలో కాకుండా, పేదరికంలో దాగి వుంది. ప్రజా శ్రేయస్సు, ప్రజల సంక్షేమం లాంటివేవీ ప్రభుత్వ ఎజెండాలో లేవు. అక్షరాస్యతా స్థాయి, సామాజిక స్పృహ, జనాభా పెరుగుదలలు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి వుంటాయి. ప్రజలు విద్యావంతులై, సాధికారతతో వారి అవగాహన మెరుగుపడితే ఎటువంటి బలవంతపు చర్యలు లేకుండానే సంతానోత్పత్తి నియంత్రణను సాధించవచ్చు.
కేరళ లాంటి రాష్ట్రాలు విద్యా వైద్య, ఆరోగ్య రంగాల్లో చేసిన అభివృద్ధి ఫలితాలను ఈ విషయంలో పరిగణనలోకి తీసుకోవాలి. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం, ప్రజల జీవన పరిస్థితులను ఏనాడూ పట్టించుకోలేదు. కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా వున్న ప్రభుత్వ విధానాల వల్ల హిందూముస్లింలు ఇరువురూ బాధితులుగా మారుతున్నారనడంలో సందేహం లేదు.
/ వ్యాసకర్త సెల్‌ : 9848412451/
బోడపట్ల రవీందర్‌
తాజా వార్తలు

Related Keywords

Delhi ,India ,Kerala ,New Delhi ,Tamil Nadu , ,Supreme Court ,Interest Rate Center ,Cm Yogi International Mens Day ,International Mens Day ,Fact Run ,Run Central ,West Bengal ,Kerala As United States Education Medical ,டெல்ஹி ,இந்தியா ,கேரள ,புதியது டெல்ஹி ,தமிழ் நாடு ,உச்ச நீதிமன்றம் ,சர்வதேச ஆண்கள் நாள் ,ஓடு மைய ,மேற்கு பெங்கல் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.