comparemela.com


ప్రపంచంలోనే ఒకే ఒక్క గుర్రం అది.. చనిపోయింది
ప్రపంచంలోనే ఆ గుర్రానికి ఓ అరుదైన గుర్తింపు ఉంది. ఎందుకంటే అలాంటి గుర్రం ఈ భూమ్మీద అదొక్కటే. అత్యంత ఎత్తైన గుర్రంగా ‘గిన్నిస్‌ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో సొంతం సంపాదించుకున్న ఆ గుర్రం తాజాగా తన చివరి శ్వాస విడిచింది. బెల్జియ‌న్ జాతికి చెందిన ఈ గుర్రం పేరు బిగ్ జాక్. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం, కొలంబియా కౌంటీలోని పోయ్‌నెట్టి గ్రామంలో ఓ గుర్రపు శాల‌లో ఇన్నాళ్లూ దీని ఆలనాపాలనా చూశారు. నిర్వాహకులు. కానీ రెండు వారాల క్రితం బిగ్ జాక్ మృతి చెందింది. ఈ విషయాన్ని దాని య‌జ‌మాని జెర్రీ గిల్బర్ట్‌ భార్య వ‌లీషియా గిల్బర్ట్‌ వెల్లడించారు. ప్రస్తుతం బిగ్ జాక్ వ‌య‌సు 20 ఏళ్లని, అది చనిపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందని చెప్పుకొచ్చారు. అయితే బిగ్ జాక్ జ్ఞాప‌కంగా ఇంతకాలం అది నివ‌సించిన స్టాల్‌ను ఖాళీగా ఉంచుతామని జెర్రీ గిల్బర్ట్ చెప్పారు. స్టాల్ బ‌య‌ట ఒక ఫ‌ల‌కం ఏర్పాటు చేసి దానిపై బిగ్ జాక్ బొమ్మ వేయించి, దాని పేరును చెక్కిస్తామని వివరించారు.
అలాగే బిగ్ జాక్ గురించి ఆమె వివరిస్తూ.. ‘బిక్ జాక్ పుట్టినప్పటి నుంచే అరుదైన గుర్రంగా నిలిచింది. సాధారణంగా బెల్జియం జాతి గుర్రాలు 100 నుంచి 140 పౌండ్ల(45 నుంచి 65 కిలోల) బ‌రువుతో పుడుతాయి. కానీ అసాధార‌ణంగా 109 కిలోల(240 పౌండ్లు) బరువుతో అధిక బ‌రువుతో జన్మించింది. 6.10 అడుగులు ఎత్తు(2.1 మీట‌ర్లు) ఉండేది. దాని బ‌రువు 1,136 కిలోలు(2,500 పౌండ్లు). ఇది నబ్రాస్కాలో పుట్టింది.

Related Keywords

United States ,Belgium ,Kingdom Of Belgium , ,Big Jack ,United States Wisconsin State ,Columbia Village ,ஒன்றுபட்டது மாநிலங்களில் ,பெல்ஜியம் ,கிஂக்டம் ஆஃப் பெல்ஜியம் ,பெரியது பலா ,கொலம்பியா கிராமம் ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.