comparemela.com


వైన్‌.. అమ్మకాలు ఫైన్‌
- రాష్ట్రంలో పెరుగుతున్న వైన్‌ ప్రియులు  
- కరోనాలోనూ జోరుగా వ్యాపారం 
బెంగళూరు: కరోనా క్లిష్ట సమయంలో అన్ని వ్యవస్థలు స్తంభించగా దాదాపు అన్ని పరిశ్రమలకు నష్టం వాటిల్లింది. కానీ వైన్‌ వ్యాపారాలు మాత్రం నిలకడగా సాగాయి. అందుకు ముఖ్యకారణం వైన్‌ సేవించేవారి సంఖ్య రాష్ట్రంలో ఏటా పెరుగుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 63 లక్షల లీటర్ల వైన్‌ విక్రయాలకు రూ.258కోట్ల వ్యాపారం సాగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు ఏడెనిమిది నెలలపాటు కరోనా లాక్‌డౌన్‌ కొనసాగింది. అయినా 57లక్షల లీటర్ల వైన్‌ వి క్రయం కాగా రూ.253 కోట్ల వ్యాపారం సాగింది. రాష్ట్రంలో దశాబ్దాలకాలంగా ద్రాక్షతోటలు సాగు చేస్తున్నారు. పండించిన ద్రాక్షను గతంలో వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. అయితే ఇటీవల కొన్నేళ్లుగా స్థానికంగానే వైన్‌ తయారీ కేంద్రాలు వెలిశాయి. దీంతో సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు వైన్‌ తాగేవారు అధికమయ్యా రు. వైన్‌ కోసం సాగుచేసే ద్రాక్ష చిక్కబళ్ళాపుర జిల్లా నంది ప్రాంతం, బెంగళూరు నగర, గ్రామీణ, రామనగర్‌, కోలారు, తుమకూరు, కృష్ణానదీ తీరప్రాంతమైన బెళగావి, బాగల్కోటె, విజయపుర, కలబుర్గి, బీదర్‌లతోపాటు కావేరీ నదీ ప్రాంతమైన మండ్య, మైసూరు, చామరాజనగర్‌లతోపాటు హంపి ప్రాంతానికి అనుబంధమైన కొప్పళ, గదగ్‌, బళ్ళారి, రాయచూరుతోపాటు దాదాపు రాష్ట్రమంతటా ప్రాంతాలవారీగా సాగుచేస్తారు. వైన్‌ తయారీకోసం తయారయ్యే ద్రాక్ష రకాలలో సిరాజ్‌, కేబర్‌నెట్‌ ఫ్రాంక్‌, మేలట్‌, కినోట్‌ నయర్‌, పియాంపీ, గ్రేనాశ్‌, బ్యూజోలైఫ్‌, కేబర్‌నెట్‌ à°¸ వెన్యూ, జిమ్‌ఫండల్‌, గైనీ, బోడో, నబూలో, అగ్లియానిక్‌, బార్బరాతోపాటు వైట్‌వైన్‌ తయారీకోసం పెనిమ్‌బ్లాంక్‌, పమిన్యూ, పడోర్నా, మస్కట్‌, తెనియాన్‌, పినూబ్లాంక్‌, వియన్నా రకాలు సాగుచేస్తారు. 
15 తయారీ కేంద్రాలు 
రాష్ట్రంలో హెరిటేజ్‌ గ్రేప్‌ వైననీ, నిసర్గ, ఎస్‌బీయూ, కేఆర్‌ఎ్‌సఎం ఎస్టేట్‌, సిలికాన్‌ వ్యాలీ, వింటేజ్‌, హంపి హెరిటేజ్‌, నందివ్యాలీ, దాదా వైనరీతోపాటు 15 తయారీ కేంద్రాలు ఉండగా 300 నుంచి 400 బ్రాండ్‌లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 232 వైన్‌హోటళ్ళు, 80 బోటిక్‌లు ఉన్నాయని కర్ణాటక వైన్‌బోర్డు ఎండీ సోము తెలిపారు. ప్రకృతిపరంగా లభించే వైన్‌ కావడంతో సేవించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలికాలంలో వైన్‌ తాగేవారి సంఖ్య సర్వేల ద్వారా తెలుస్తోందని ఆయన వివరించారు. 

Related Keywords

Oslo ,Norway ,Bangalore ,Karnataka ,India ,Vienna ,Wien ,Austria ,Hampi ,Bellary , ,Business Bangalore ,District Nandi Region ,ஒசிலோ ,நோர்வே ,பெங்களூர் ,கர்நாடகா ,இந்தியா ,வியன்னா ,வீந் ,ஆஸ்ட்ரியா ,ஹம்பி ,பெல்லரி ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.