బెంగళూరు : కరోనా కేసులు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కేరళ, మహారాష్ట్ర సరిహద్దులుగా కలిగిన ఎనిమిది జిల్లాల్లో వారాంతపు కర్ఫ్యూను అమలు చేస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం రాత్రి 9 గంటల నుండి సోమవారం ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన బెల్గావి, బీదర్, విజయ్పురా, కల్బుర్గిలతో పాటు కేరళ సరిహద్దులుగా కలిగిన దక్షిణ కన్నడ, కొడగు, మైసూరు, చామరాజ్ నగర్‌లలో ఈ కర్ఫ్యూ అమలు కానుంది. అత్యవసర కార్యకలాపాలు మినహా ఎవరూ బయటకి రాకూడదని లేకుంటే కఠిన చర్యలు తప్పవని కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.