ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం) : దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఐక్య పోరాటాలతో కాపాడుకుందామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు సింహాచలం అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం వద్ద చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 181వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ సామాన్యులను విస్మరిస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా విక్రయిస్తూ దేశ భవిష్యత్తును నాశనం చేస్తోందని పేర్కొన్నారు.