గ్లోబలీకరించబడిన ప్రపంచంలో వ్యాక్సినేషన్ విషయంపై మొత్తం ప్రపంచాన్ని యూనిట్‌గా తీసుకుని ఆలోచించాలే గాని ఏ ఒక్క దేశం, లేక రాష్ట్రం పరిధిలో ఆలోచించకూడదు. కానీ పశ్చిమ దేశాలు సరిగ్గా దానికి వ్యతిరేక దిశలో, చాలా సంకుచితంగా ఆలోచిస్తున్నాయి, నిర్ణయాలు చేస్తున్నాయి. గనుకనే వ్యాక్సినేషన్ విషయంలో ప్రపంచం నేటికీ నత్త నడక నడుస్తోంది.