సాక్షి, మహబూబాబాద్ /వరంగల్ /కమలాపూర్: నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికే పరిమితమైందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబంలో తెలంగాణ తల్లి బందీ అయ్యిందని ధ్వజమెత్తారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు కేసీఆర్ కుటుంబం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.