సాక్షి, హైదరాబాద్: కరోనా బాధితుల మానసిక ఆరోగ్యంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వారిలో తలెత్తే మానసిక సమస్యలను పరిష్కరించేందుకు అన్ని బోధనా, జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేక ఓపీని నిర్వహిస్తున్నామని వెల్లడించింది. ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయాన్ని నోడల్ కేంద్రంగా ప్రకటించింది. మానసిక బాధితులకు అవసరమైన