comparemela.com


ఇంటి దొంగలు వెళ్లిపోండి
నెలలోగా పరారవ్వాలి
ద్రోహం చేసేవారిని క్షమించం.. కష్టపడే వారిని వదులుకోం 
కేసీఆర్‌కు తంత్రమే తెలుసు.. మాకు మంత్రం తెలుసు 
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మేమే
గోల్కొండపై జెండా.. టీఆర్‌ఎస్‌ను చెరువులో ముంచుడే
అధికారులు చట్టానికి లోబడి పని చేయాలి: రేవంత్‌
పెట్రో ధరల పెంపును నిరసిస్తూ సైకిల్‌, ఎడ్లబండ్ల ర్యాలీలు
జిల్లా కేంద్రాల్లో పాల్గొన్న కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)
కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీకి ద్రోహం తలపెట్టే ఇంటిదొంగలంతా నెల రోజుల్లోగా పరార్‌ కావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. తాను.. జానారెడ్డి అంత పెద్దమనిషిని కాదని, అంత మంచోణ్ని కూడా కాదని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలను వదులుకోబోమని, వారందరినీ గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామని చెప్పారు. అదే సమయంలో నమ్మక ద్రోహం చేసే వారిని మాత్రం వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. సోమవారం పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో సైకిల్‌ ర్యాలీ, ఎడ్లబండ్ల ర్యాలీలు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మల్‌లో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో చేపట్టిన ర్యాలీలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ కౌరవుల ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ పాండవులతో సమానమని, ధర్మం కాంగ్రెస్‌ వైపే నిలుస్తుందని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందని, రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చి గోల్కొండ కోటపై జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బండి యాదగిరి రచించి పాడిన ’బండెనక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి’ అన్న చందంగా.. నిజాం ప్రతినిధిగా వ్యవహరిస్తున్న నియంత కేసీఆర్‌ను గోల్కొండ కోట కిందనే పాతరేస్తామని అన్నారు. కేసీఆర్‌కు కేవలం తంత్రం మాత్రమే తెలుసునని, తమకు తంత్రంతోపాటు మంత్రం, యంత్రం కూడా తెలుసని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించిన పాత్రికేయులకు కేసీఆర్‌ హయాంలో కనీస గౌరవం దక్కడంలేదన్నారు. 
స్థానిక ప్రజాప్రతినిధులకు అవమానాలే..
స్థానిక ప్రజా ప్రతినిధులు అవమానాలకు గురవుతున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు అభివృద్ధి పేరిట దోపీడీకి పాల్పడుతుంటే.. సర్పంచ్‌లు మాత్రం ఎన్నికల్లో పెట్టిన ఖర్చుతో అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో అక్రమాలకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే బాధ్యత అని ఆరోపించారు. దళారులు, మిల్లర్లు ఎమ్మెల్యేలకు పెద్ద మొత్తంలో కమీషన్లు చెల్లించినందునే రైతుల నుంచి కోతలు జరిగాయని దుయ్యబట్టారు. కానీ, నిర్మల్‌కు చెందిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అమ్మిన 260 బస్తాల ధాన్యానికి మాత్రం అధికారులు కోతలు విధించలేదన్నారు. మంత్రికో న్యాయం, రైతుకో న్యాయమా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ సీఎం అయిన తరువాత రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలన్నీ తలకిందులయ్యాయన్నారు.
మహిళలే బతుకమ్మలు, బోనాలను ఎత్తుకోవడం సంప్రదాయంగా ఉండేదని, కేసీఆర్‌ హయాంలో ఎమ్మెల్యేలు, మంత్రులంతా బతుకమ్మలు, బోనాలను ఎత్తుకొని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురి చేసే అధికారులను వదిలిపెట్టబోమని, మోకాళ్ల చిప్పలు పగలగొడతామని హెచ్చరించారు. ఇకనైనా అధికారులు చట్టానికి లోబడి పని చేయాలన్నారు. అంతకుముందు నిర్వహించిన ర్యాలీలో కార్యకర్తలనుద్దేశించి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పెట్రోల్‌, డీజీల్‌, వంటగ్యాస్‌ ధరల పెరుగుదలకు ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌దే బాధ్యత అని అన్నారు. ప్రజల బతుకులను వారు బజారుకీడుస్తున్నారని ఆరోపించారు. వారిద్దరితో కాంగ్రెస్‌ పార్టీ యుద్ధం మొదలుపెట్టిందని ప్రకటించారు. త్వరలోనే కేసీఆర్‌ను, టీఆర్‌ఎ్‌సను చెరువులో ముంచుతామని, ఆయన లక్కీ నంబర్‌ను తలకిందులు చేస్తామని అన్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆయన సోదరుడు మురళీధర్‌రెడ్డి భూముల అక్రమ దందాను నిగ్గు తేలుస్తామన్నారు. 
హోరెత్తిన కాంగ్రెస్‌ నిరసనలు..
సోమవారం కాంగ్రెస్‌ పార్టీ నిరసనలతో అన్ని జిల్లా కేంద్రాలు హోరెత్తాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. ఖమ్మంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ధరల పెంపుతో ప్రజలను కష్టాలపాలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పేరోజు దగ్గర్లోనే ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో జరిగిన నిరసనలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ పాల్గొన్నారు. పెట్రోలు, డీజిల్‌ ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. మెదక్‌లో ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎడ్లబండి పైనుంచి కిందపడడంతో స్వల్ప గాయాలయ్యాయి. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు, ఫిరోజ్‌ఖాన్‌ హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌ వద్దకు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.
రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా పోలీసు రాజ్యం నడుస్తోందని నేతలు ఆరోపించారు. మరో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి మిర్యాలగూడలో ఎడ్లబండిని స్వయంగా లాగి నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో పెట్రో ధరల పెంపును నిరసిస్తూ.. ఓ ద్విచక్ర వాహనాన్ని ఎస్సారెస్పీ కాకతీయ కాలువలో పడేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ పాల్గొన్నారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీలో మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ మాట్లాడారు. ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు భూపాలపల్లిలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్‌ మౌనంగా ఎందుకుంటున్నారని ప్రశ్నించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఆర్‌.దామోదర్‌రెడ్డి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నిరసనల్లో పాల్గొన్నారు. కాగా, పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలపై పన్నులు తగ్గించాలని కోరుతూ రాష్ట్రపతికి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి లేఖ రాశారు.

Related Keywords

Miller Mlas ,Kakatiya Canal ,Bhatti Vikramarka ,Ponnala Lakshmaiah ,Advertising Committee ,Committee Damodar Raja Narasimha ,Run Committee ,Golconda Castle ,Prime Minister Modi ,His Lucky ,Ranga Reddy ,Kodad District Petro ,Peddapalli District ,Minister Ali ,Vice President ,கக்த்திய கால்வாய் ,பொன்னாள லக்ஷ்மையா ,ஓடு குழு ,ப்ரைம் அமைச்சர் மோடி ,ரங்கா சிவப்பு ,பெட்தாபபல்ளி மாவட்டம் ,அமைச்சர் அலி ,துணை ப்ரெஸிடெஂட் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.