comparemela.com


రెండేళ్లైనా బిల్లులకు మోక్షం లేదు!
వ్యవసాయ పరికరాల డీలర్లకు 145కోట్లు పెండింగ్‌ 
అయినా మళ్లీ సరఫరా చేయాలని హుకుం
లేకపోతే.. బ్లాక్‌ లిస్టులో పెడతామంటూ హెచ్చరికలు
వ్యవసాయ శాఖ తీరుపై డీలర్ల  ఆవేదన
అమరావతి, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): పాత బాకీ చెల్లించి, మళ్లీ అప్పు అడగటం ఉభయతారకం. కానీ రాష్ట్ర వ్యవసాయశాఖ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రాయితీ పథకాలపై వ్యవసాయ పరికరాలు సరఫరా చేసిన కంపెనీల డీలర్లకు రెండేళ్లుగా బిల్లులు చెల్లించకుండా, మళ్లీ పనిముట్లు సరఫరా చేయాలని హుకుం జారీ చేసింది. 2018-19లో రైతు రథం పథకంలో ట్రాక్టర్లతో సహా అనేక వ్యవసాయ పరికరాలను సరఫరా చేసినందుకు వివిధ కంపెనీల డీలర్లకు ప్రభుత్వం రూ.145కోట్లు చెల్లించాల్సి ఉంది. అందులో రూ.85కోట్లకు బిల్లులు సీఎ్‌ఫఎంఎస్‌ ఐడీలో ఉన్నాయంటున్నారు. మిగిలిన రూ.65కోట్లలో రూ.40కోట్లకు బిల్లులు సిద్ధం చేశారు. మిగిలిన రూ.25కోట్లకు బిల్లులు వ్యవసాయశాఖ కమిషనర్‌ కార్యాలయంలోనే పెండింగ్‌లో ఉన్నట్లు చెప్తున్నారు. వాటిని ఆర్థికశాఖ క్లియరెన్స్‌కు పంపకపోవడం వల్ల నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోందని చెప్తున్నారు. వాస్తవానికి 2019 ఏప్రిల్‌ నాటికే  చెల్లింపులు జరగాల్సి ఉంది. కానీ  రైతురథం పథకంలో అవకతవకలు జరిగాయంటూ, ప్రస్తుత ప్రభుత్వం.. మొత్తం వ్యవసాయ యాంత్రీకరణ పథకాల బిల్లులు పెండింగ్‌ పెట్టిందని డీలర్లు వాపోతున్నారు. రాష్ట్రంలో సుమారు 385మంది డీలర్లు, తయారీ కంపెనీలు ఉండగా, దాదాపు డీలర్లందరికీ ఎంతో కొంత బిల్లులు రావాల్సి ఉంది. దీంతో పాత బిల్లులు చెల్లించకుండా, పరికరాలు సరఫరా చేయలేమని అనేక మంది డీలర్లు చేతులెత్తేశారు. కానీ జూలై 8à°¨ రైతుభరోసా కేంద్రాల్లో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ప్రారంభానికి అవసరమైన పరికరాలను సరఫరా చేయకపోతే, బ్లాక్‌ లిస్టులో పెడతామంటూ అధికారులు హెచ్చరికలు చేసినట్లు వాపోతున్నారు. పోనీ ముందుగా సీఎ్‌ఫఎంఎస్‌ ఐడీలో ఉన్న రూ.85కోట్ల బిల్లులైనా విడుదల చేయాలని కోరితే సమాధానం లేదంటున్నారు.

Related Keywords

,Department Of Agriculture ,Department Of Agriculture Office ,Center Start ,Farm The Department ,Programs Farm ,Agriculture Office ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.