comparemela.com


మన రహదారి.. గతుకుల దారి!
మరమ్మతులు లేక రాష్ట్రంలో అధ్వానంగా రోడ్లు.. కంకర, గుంతల మధ్య ప్రయాణాలతో ప్రమాదాలు
కంకర తేలుతూ.. గుంతలు గుంతలుగా..
అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగు నీరంతా రోడ్లపైకే 
సీసీ రోడ్లు లేక బురదమయంగా కాలనీ రహదారులు
నిధుల విడుదల లేకపోవడంతో పలుచోట్ల నిలిచిన పనులు
జీహెచ్‌ఎంసీలో గతుకులకు మొక్కుబడిగా అతుకులు
నిబంధనలకు నీళ్లొదులుతున్న కాంట్రాక్టర్లు.. పర్యవేక్షణ లేమి
వందల కోట్లు ఖర్చు చేస్తున్నా.. పరిస్థితిలో కానరాని మార్పు
‘‘పదేళ్లుగా వృద్ధ దంపతులు వారి పింఛన్‌ సొమ్ముతో రోడ్లపైన గుంతలను పూడ్చుతున్నారు. మీరేం చేస్తున్నారు? ఆ వృద్ధ దంపతులను చూసి సిగ్గు పడాలి..!’’.. ఇదీ ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం ఖ్యాతిగడించిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)కి పెట్టిన చివాట్లు..! ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే కాదు.. ఇప్పుడు రాష్ట్రమంతటా రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. ‘‘ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం..’’ అన్నట్లుగా రహదారులు తయారయ్యాయి. అడుగడుగునా గుంతలు, వాహనదారుల నడ్డి విరిచేలా కంకర తేలిన గతుకుల రహదారులు చినుకు పడితే చాలు.. గోదారిగా.. కాల్వలుగా, చిత్తడి భూములుగా మారిపోతున్నాయి. వాహనదారుల పాలిట ప్రమాదకరంగా మారుతున్నాయి. రోడ్డెక్కాలంటేనే బెంబేలెత్తే పరిస్థితులను సృష్టిస్తున్నాయి. హైవేలు మొదలు.. గ్రామీణ రోడ్ల దాకా ఇదే దుస్థితి..!
(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)
పట్టణాలు, గ్రామాల్లో రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లు ఇప్పుడు నరకప్రాయమయ్యాయి. ముఖ్యంగా ఇసుక లారీలు, ట్రాక్టర్లు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లోని రోడ్లు తరచూ దెబ్బతింటున్నాయి. భారీ వాహనాల ఒత్తిడికి రోడ్లు దెబ్బతిని.. వర్షాలు పడ్డప్పుడు, నీళ్లు నిలిచి గోతులు ఏర్పడుతున్నాయి. పల్లెలు, పట్టణాల్లోని కాలనీల్లో సీసీ రోడ్లు నిర్మించకపోవడంతో జానెడు లోతు దిగబడే బురద రోడ్లపై పడుతూ లేస్తూ ప్రయాణం సాగించాల్సి వస్తోంది. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేని పట్టణాల్లోనైతే మురునీరు రోడ్లపై కొట్టుకొస్తోంది. మెదక్‌ జిల్లా జోగిపేటకు రెండు వైపులా మూడు కిలోమీటర్ల మేర రోడ్డుపై కంకర తేలింది. భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు. జిల్లాలోని పెద్ద శంకరంపే ట, అల్లాదుర్గం మండలాల పరిధిలో ప్రధాన రహదారులు కూడా అధ్వానంగా మారాయి. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ పట్టణంలోనూ రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. సిద్దిపేటలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల కారణంగా రోడ్లు ధ్వంసమయ్యాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌ నుంచి బైపాస్‌ రోడ్డు దాకా.. 60 ఫీట్ల రోడ్డుపై పెద్ద గోతులు ఏర్పడ్డాయి. నల్లగొండ జిల్లా నకిరేకల్‌-తాటికల్‌ నుంచి జిల్లా కేంద్రం వైపు వచ్చే రోడ్డుపై కంకర పోసి వదిలేయడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.  యాదాద్రి-భువనగిరి జిల్లాలోని రాయిగిరి నుంచి వలిగొండ మార్గంలో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. భువనగిరిలో రోడ్డు విస్తరణ లేకపోవడం.. సర్వీసు రోడ్డును నిర్మిచకపోవడంతో వర్షం పడ్డప్పుడు రహదారిపై నీళ్లు నిలుస్తూ.. చెరువులా తలపిస్తోంది. కరీంనగర్‌ నుంచి సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు వెళ్లేందుకు లోయర్‌ రిజర్వాయర్‌ ఆనకట్ట కింది భాగంలో వేసిన ఔటర్‌రింగ్‌ రోడ్డు మూడు చోట్ల దెబ్బతిన్నది.  పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌ పరిధిలో శారదానగర్‌ రోడ్డు పూర్తిగా మట్టిరోడ్డు. దీంతో వర్షం పడ్డప్పుడల్లా బురదమయం అవుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం శివారు ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో.. కొద్దిపాటి వర్షానికే రోడ్లు బురదమయం అవుతున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రం, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ ప్రాంతాల్లోని రోడ్లు.. సిరిసిల్ల జిల్లా మునిసిపాలిటీలో విలీనమైన ఏడు గ్రామాల్లోని రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నుంచి సత్తుపల్లి రహదారిలో.. అశ్వారావుపేట నుంచి మందలపల్లి దాకా 10 కిలోమీటర్ల మేర రోడ్డంతా గుంతలు ఏర్పడ్డాయి. పాలమూరు జిల్లా  జడ్చర్ల మునిసిపాలిటీలోని ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు చినుకు పడితే చిత్తడిగా మారుతున్నాయి.  నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఉ మ్మడి వరంగల్‌ జిల్లాల్లోనూ పలు ప్రాం తాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
హుజూరాబాద్‌లో  ‘ఉప’ మెరుపులు!
హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలో రోడ్ల అభివృద్ధికి చర్యలు జోరందుకున్నాయి. హుజూరాబాద్‌, జమ్మికుంట మునిసిపాలిటీల పరిధిలో రోడ్ల పనులు ఒకట్రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇందుకుగాను హుజూరాబాద్‌ మునిసిపాలిటీ పరిధిలో రూ.35.52 కోట్లు, జమ్మికుంట పరిధిలో రూ.31.8 కోట్ల చొప్పున సర్కారు కేటాయింపులు జరిపింది. వీలైనంత త్వరగా ఈ రోడ్ల పనులు పూర్తి చేయాలని ఆదేశాలు వెళ్లాయి.
అతుకులకూ నిధులలేమి?
రాష్ట్రంలో కొన్నిచోట్ల రోడ్లకు మరమ్మతుల(ప్యాచ్‌వర్క్‌)ను  అకస్మాతుగా నిలిపివేశారు. నిధులు లేకపోవడం ఇందుకు కారణం. నిర్మల్‌ జిల్లా  కేంద్రంలోని ఈద్గాం చౌరస్తా నుంచి సిద్దిలకుంట వరకు ఏడు కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన రోడ్డు పనులు 4 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. 2017లో రూ.8 కోట్లను సర్కారు మంజూరు చేసి, టెండర్లు ఆహ్వానించింది. పనులు మొదలు పెట్టిన కాంట్రాక్టరు 12 కల్వర్టులను కూడా నిర్మించాడు. రోడ్డు పనులు ప్రారంభమయ్యే సమయానికి.. ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో కాంట్రాక్టరు పనులను ఆపేశాడు.  
జీహెచ్‌ఎంసీలో మొక్కుబడిగా మరమ్మతులు
హైదరాబాద్‌ సిటీ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): à°—్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రహదారులు 9,103 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. వీటిల్లో 70ు బీటీ రోడ్లు కాగా.. మిగతావి సీసీ రహదారులు. ఇక్కడ రహదారుల నిర్మాణం, నిర్వహణకే ఏటా రూ. 400-రూ. 600 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. 2018 అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల సమయంలో మాత్రం.. రోడ్లపైన రూ. 800 కోట్ల వరకు వెచ్చించారు. రోడ్ల నిర్మాణానికి ముందు పీరియాడికల్‌ ప్రివెంటివ్‌ మెయింటనెన్స్‌(పీపీఎం) పేరిట ముందస్తు కార్పెటింగ్‌, రీ-కార్పెటింగ్‌ పనులకే రూ. 500 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అయి నా.. నగర రోడ్ల పరిస్థితిలో మార్పు రావడం లేదు. అద్దాల్లా ఉండే రోడ్లు కూడా.. చినుకు పడితే గతుకులమయంగా మారుతున్నాయి. సమగ్ర రోడ్డు నిర్వహణ పథకాన్ని అమల్లోకి తెచ్చినా.. ఆశించిన ఫలితాలు రావడం లేదు.  ప్యాచ్‌వర్క్‌లకూ వందల కోట్లలో ఖర్చు చేస్తున్నా.. పరిస్థితిలో మార్పు ఉండడం లేదు. ఏడాది కాలంలో 16 వేల ప్యాచ్‌వర్క్‌లు చేసి, గుంతలను పూడ్చామని అధికారులు చెబుతున్నా.. వర్షం పడ్డ ప్రతిసారి కనీసం 200 వరకు గుంతలు కొత్తగా పుట్టుకొస్తున్నాయి.  

Related Keywords

,Kodad District Center ,High Court Main ,District Center ,Colony Roads ,State Road ,Roads Tails ,Main Roads ,Sangareddy District ,Nalgonda District ,Peddapalli District Ramagundam ,Khammam District ,Palamuru District ,Roads Repair ,Beatty Roads ,மாவட்டம் மையம் ,காலனி சாலைகள் ,நிலை சாலை ,பிரதான சாலைகள் ,சங்கரேட்டி மாவட்டம் ,நல்கொண்டா மாவட்டம் ,கம்மம் மாவட்டம் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.