వాషింగ్టన్ : ఆఫ్ఘన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌లు మరోసారి చర్చించారు. ఆఫ్ఘన్ విషయంలో కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. బ్లింకెన్ జైశంకర్‌తో శుక్రవారం ఫోన్‌లో మాట్లాడారు. కాబుల్ విమానాశ్రయ కార్యకలాపాలు సాధారణ స్థితికి రాగానే... ఆఫ్ఘన్ నుండి భారతీయులను తీసుకొస్తామని, ఈ విషయమై అమెరికాతో సంప్రదింపులు నిర్వహిస్తున్నామని జైశంకర్ గతంలో వెల్లడించారు. ఆఫ్ఘన్‌ను విడిచి వెళ్లాలనుకునే వారికి అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.