సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా టీకా కార్యక్రమం విజయవంతమయ్యేలా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషించాలని, అందుకు తమ పార్టీ సభ్యులంతా తీవ్రంగా కృషిచేయాలని ఆ పార్టీ చీఫ్ సోనియా గాంధీ పిలుపు నిచ్చారు. కోవిడ్ టీకాపై పౌరుల్లో నెలకొన్న భయాలు, సంకోచాలను నివృత్తి చేసేలా పార్టీ కార్యకర్తలంతా తమ వంతు కృషిచేయాలని సోనియా అభిలషించారు. కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు దేశం