మరింత సమానత్వంతో కూడిన, న్యాయమైన, ప్రజాస్వామ్యయుతమైన ప్రపంచ వ్యవస్థ కోసం కలిసికట్టుగా కృషి చేయాలని క్యూబా అధ్యక్షుడు మిగుయెల్ డియాజ్ కానెల్ ఐక్యరాజ్య సమితిని కోరారు. ఇటువంటి వ్యవస్థలో ఏ ఒక్కరూ కూడా వెనుకబడరాదని అన్నారు. ఆన్‌లైన్‌లో జరిగిన జనరల్ అసెంబ్లీ ఉన్నత స్థాయి సమావేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. అన్యాయమైన, అప్రజాస్వామికమైన అంతర్జాతీయ వ్యవస్తే సమాజంలో అసమానతలకు కారణమని అన్నారు. నేడు పలు దేశాలు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, కోవిడ్ సంక్షోభంలో ఇది మరింత స్పష్టంగా బయటపడిందని ఆయన చెప్పారు.