పొద్దున్న లేస్తే గొడవలు, పేచీలు, రాజీలు, సర్దుబాట్లు.. ఇన్నింటి మధ్య కొంత నిశ్శబ్దం కావాలి. ఒంటి మీద ఖాకీ పడింది మొదలు దొంగలు, నేరస్తులు, మోసగాళ్ల ఆటకట్టించడమే పని. వీరి నీడ కూడా పడని స్థలంలో కాసేపు గడపాలి. బయటే కాదు ఇంతులకు ఇంటిలోనూ జీవిత కాల ఉద్యోగమే కదా. ఆ తలనొప్పులు తప్పేలా మనసుకు ప్రశాంతత దొరకాలి. బాధలు, హోదాలు మరిచి దేవుడి సన్నిధిలో సేద తీరాలి. శ్రావణం ఆ సమయాన్నిస్తోంది.