రచనకు ప్రమాణమే ప్రాణమని బలంగా భావించేవారాయన. అందుకే కావ్యం ప్రారంభించి... దానికి ప్రామాణికత లభించక పోవడంతో 40 ఏళ్ల పాటు విరామం ప్రకటించారు. చారిత్రక నేపథ్యం కలిగిన కావ్యానికి ఉపయుక్తమే జీవధాతు అంటారు. ఆయనే పల్నాట ప్రభవించిన ప్రౌఢ కవివరేణ్యులు - కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చిటిప్రోలు కృష్ణమూర్తి. ఆయన పండితుడు కానప్పటికీ అక్షరానికి పాండిత్యాన్ని పులిమాడు. పద్య కవిత్వంలో కవిరాజుగా వెలుగొందాడు. చిటిప్రోలు కృష్ణమూర్తి 1932 డిసెంబరు 25వ తేదీన కనకమ్మ, వెంకటరత్నం దంపతులకు జన్మించారు. ఈనెల 2వ తేదీ గురువారం తెల్లవారు జామున అస్తమించారు.