అఫ్జల్‌గంజ్: ఆర్టీసీ నూతన ఎండీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్ బుధవారం మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం జీడిమెట్ల డిపోకు చెందిన గండి మైసమ్మ–అఫ్జల్‌గంజ్ బస్సులో లక్డీకాపూల్ వద్ద ఎక్కి సాధారణ వ్యక్తిలా టికెట్టు తీసుకొని సీబీఎస్ వరకు ప్రయాణించారు. తోటి ప్రయాణికులతో మాటలు కలిపి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సీబీఎస్ నుంచి కాలినడకన