నిపుణులు ఇచ్చిన సమాధానాలు
నా నెలసరి ఆదాయం రూ. 13 వేలు. నేను రెండు ఎల్ఐసి పాలసీలలో మదుపు చేస్తున్నాను. నెల నెలా రూ. 10 వేలతో సిప్ చేయాలనుకుంటున్నాను.సలహా ఇవ్వండి.
Asked by Phani Teja on
03 ఆగస్టు 2021
మీరు సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. రిస్క్ తీసుకోగలిగితే దీనితో పాటు ఎస్బీఐ స్మాల్ కాప్ ఫండ్ కూడా ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
సాధారణంగా, బీమా కంపెనీ లు అందించే పాలసీలలో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే ఉంటుంది. వీలయితే సరెండర్ చేయడం మంచిది. కొంత వరకు నష్టపోయినా మంచి పెట్టుబడి పథకాలలో మదుపు చేయడం మేలు. బీమా కోసం ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
మరిన్ని