comparemela.com


కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి!
సీమ పర్యటనకు ఏపీ సహాయ నిరాకరణ.. 
నోడల్‌ అధికారి నియామకం, రక్షణపై స్పందించలేదు
కేంద్ర హోం శాఖకు కృష్ణా బోర్డు లేఖ.. 
నిజ నిర్ధారణ కమిటీ సీమ పర్యటన వాయిదా
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం ముదురుతోంది. రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించి, నివేదిక ఇవ్వాలన్న ఎన్జీటీ ఆదేశాల మేరకు కృష్ణా బోర్డు సీమ పర్యటనకు సిద్ధమవగా.. ఏపీ సహాయ నిరాకరణ చేసింది. బోర్డు కేంద్ర బలగాల రక్షణ కోరింది. శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తిని ఆపాలని బోర్డు తెలంగాణను ఆదేశించినా.. పూర్తిగా ఉత్పత్తి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ సర్కారు సాగర్‌ ప్రాజెక్టు వద్ద పోలీసులను భారీగా మోహరించింది. 
హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించడానికి వెళ్లే బృందానికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కోరింది. బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఈ మేరకు కేంద్ర హోం శాఖకు మంగళవారం లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి.. వాస్తవ పరిస్థితులను పరిశీలించి, నివేదిక ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించినందున పర్యటన అనివార్యమని గుర్తుచేశారు. నోడల్‌ అధికారిని నియమించడానికి ఏపీ ప్రభుత్వం నిరాకరిస్తున్నందున కమిటీ పర్యటనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. మరోవైపు బుధవారం రాయలసీమ ఎత్తిపోతల పథకం పర్యటనను బోర్డు వాయిదా వేసుకుంది. అంతా సవ్యంగా జరిగితే 3న రాయలసీమ పర్యటన ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
బుధవారమే సీమ పర్యటనకు వెళ్లాలని బోర్డు తీవ్రంగా ప్రయత్నించింది. పర్యటన కోసం నోడల్‌ అధికారిని నియమించాలని, తగిన రక్షణ కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని పదేపదే కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. ఏపీ సహాయ నిరాకరణ చేస్తున్న నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు వెళ్లలేమని కమిటీ సభ్యులు చెప్పడంతో పర్యటన వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే బోర్డు కేంద్రానికి లేఖ రాసింది. ఎలాగైనా సీమ ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించి, జూలై 12లోగా ఎన్జీటీకి నివేదిక అందించాలని కృత నిశ్చయంతో ఉంది. 

Related Keywords

United States , ,Committee Europe ,Central Home The Department ,Central Home The Department Krishna ,Central Home ,Department Krishna ,Telugu United States ,Product Setting ,Department Tuesday ,Wednesday Rayalaseema ,Wednesday Europe ,ஒன்றுபட்டது மாநிலங்களில் ,மைய வீடு ,துறை செவ்வாய் ,புதன்கிழமை யூரோப் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.