గత వారం అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పెద్ద పరిణామాల్లో ఒకటి ఆకస్ కూటమి ఏర్పాటు. అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం రకరకాల రక్షణ కూటములను కడుతున్నది. బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనాను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇప్పటికే క్వాడ్ కూటమిని ఏర్పాటు చేసిన అగ్రరాజ్యం తాజాగా బ్రిటన్, ఆస్ట్రేలియాతో కలసి ఆకస్ కూటమిని అకస్మాత్తుగా తెరపైకి తెచ్చింది. అమెరికా చర్య అణువ్యాప్తి నిరోధక ఒప్పందానికి నిలువునా తూట్లు పొడవడమే కాదు, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు తీవ్ర ముప్పు తెస్తుంది.