పొంతన లేని సాకులు చెబుతున్న అధికార్లు ఆందోళనలో పింఛనుదార్లు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బడుగు జీవులకు ఇస్తున్న సామాజిక పెన్షన్లలో రాష్ట్ర ప్రభుత్వం కొందరికి నిలిపివేస్తోంది. కారణం అడిగితే అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని పెన్షనర్లు ఆవేదన చెందుతున్నారు. ఆగస్టు నెలలో 60.50లక్షల పెన్షనర్లకు రూ.1,455.87కోట్లు ఇచ్చిన ప్రభుత్వం సెప్టెంబర్‌లో 59.18లక్షల మందికి పెన్షన్లు ఇచ్చింది. దీనికి చేసిన ఖర్చు రూ.1,382.63కోట్లు.