కరోనా మృతులకు పరిహారంపై సుప్రీం కోర్టు 11లోపు అఫిడవిట్ దాఖలు చేయాలి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారం అందించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి పట్ల అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఆదేశాలు ఇచ్చినప్పటికీ పరిహారం, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి మార్గదర్శకాలు ఎందుకు రూపొందించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మార్గదర్శకాలు రూపొందించే నాటికి మూడో వేవ్ కూడా ముగుస్తుందేమోనని చురకలేసింది.