సాక్షి, జడ్చర్ల: ఆన్‌లైన్ క్లాసుల పేరుతో ఓ ప్రైవేట్ టీచర్ ఉచ్చులో చిక్కుకున్న బాలిక కథ విషాదాంతమైంది. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలం రేపిన పోక్సో కేసులో బాధితురాలు (15ఏళ్ల బాలిక) బుధవారం జడ్చర్లలోని గౌరీశంకర్ కాలనీలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ‘మమ్మీ, డాడీ సారీ.. తప్పు నాదే’ అని బాలిక రాసిన సూసైడ్ నోట్ గదిలో దొరికింది. ఓ ప్రైవేట్