మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సచివాలయంలో మంగళవారం సెర్ప్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో పారదర్శకంగా నూరు శాతం ఇంటి పన్ను వసూలకు ఈ యాప్ దోహదపడుతుందన్నారు.