comparemela.com


తేజశ్విని హత్య కేసులో సత్వర న్యాయం కోరుతున్న తల్లిదండ్రులు
నెల్లూరు: ప్రేమోన్మాది చేతిలో బలి అయిన తేజశ్విని హత్య కేసులో సత్వర న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. తమ పాప తన భవిష్యత్తు గురించి ఎన్నో కలలుగన్నదని... ఎంఎస్ కోసం అమెరికా కాని, ఆస్ట్రేలియా కాని పంపుదామని అనుకున్నామని తేజశ్విని తండ్రి సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.  రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు కల్పించిందన్నారు. తమ పాప జీవించే హక్కు హరించిన వెంకటేశ్‌కి కూడా జీవించే హక్కు లేకుండా చేయాలని సుధాకర్ డిమాండ్ చేశారు. తాము ఎంతో మందిని కాపాడామని...కానీ తమ పాపని కాపాడుకోలేక పోయామని తేజశ్విని తల్లి సరిత ఆవేదన చెందారు. ఇటీవల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడని తమ పాప చెప్పిందన్నారు. పోలీసులని ఆశ్రయించేందుకు పరువుప్రతిష్టల గురించి ఆలోచించి తప్పుచేశామని.... ఆ తప్పు ఎవరూ చేయొద్దని తల్లి సరిత వినతి చేశారు. 

Related Keywords

Australia ,United States , ,United States Black ,Australia Black ,Sarita Request ,ஆஸ்திரேலியா ,ஒன்றுபட்டது மாநிலங்களில் ,ஒன்றுபட்டது மாநிலங்களில் கருப்பு ,ஆஸ்திரேலியா கருப்பு ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.