వాషింగ్టన్ : గ్రహశకలాలు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగిస్తూనే ఉంటాయి. 4,500 అడుగుల వెడల్పు కలిగిన ఒక గ్రహశకలం శనివారం భూమికి చేరువుగా రానున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' తెలిపింది. సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌరవ్యవస్థ ఏర్పడిన తర్వాత అంతరిక్షంలో మిగిలి ఉన్న రాతి శకలాలను గ్రహ శకలాలుగా పేర్కొంటారని నాసా వెల్లడించింది. గంటకు 94,208 కిలోమీటర్ల వేగంతో నేడు భూమికి దగ్గరగా దూసుకొస్తుందని తెలిపింది. ఈ గ్రహశకలానికి '2016 ఏజే193' అని శాస్త్రవేత్తలు పేరు పెట్టినట్లు వివరించింది.