ముంబయి : దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో తొలి డెల్టా వేరియంట్ మరణం నమోదైందని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ముంబైలో ఘట్కోపర్‌కి చెందిన 63 ఏళ్ల వృద్ధురాలు డెల్టా వేరియంట్‌తో జులై 27న మరణించారు. ఆమెకు జూలై 21న పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఆమెకు మధుమేహ వ్యాధితోపాటు అనేక వ్యాధులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఆమె కరోనా టీకా రెండు డోసులు వేసుకున్న తర్వాత మరణించడం గమనార్హం. ఆమెతో కాంటాక్ట్‌లో ఉన్న ఇద్దరు సన్నిహితులకు కూడా పరీక్షలు చేశారు. అలాగే ఆమె వైరస్ బారిన పడిన తర్వాత ప్రయాణాలు చేసిందా అనేదానిపై కూడా అధికారులు పరిశీలించారు.