comparemela.com


Jul 25,2021 06:20
ఈ పరిస్థితిలో గతం తిరగదోడటానికి రైతులు ముందుకు రావడమనే ప్రసక్తి లేకుండా పోయింది. ఏది ఏమైనా ఈ కొనుగోళ్లను కారణంగా చూపి రాజధానిని మార్చడం తర్కబద్దం కాదు. ఇప్పుడు హైకోర్టు ముందు వున్న మూడు రాజధానుల చట్టం విచారణ ఆగష్టులో మొదటి నుంచి మళ్లీ ప్రారంభం కావలసి వుంది. హైకోర్టు విచారణ తర్వాత ఎలాంటి తీర్పు వచ్చినా అవతలి పక్షం సుప్రీంను ఆశ్రయించే అవకాశం వుంటుంది గనక ... ఈ ఏడాది ఆ విచారణలతో గడచిపోవచ్చు. ఈలోగా ఆందోళన చేస్తున్న రైతులతో స్థానికులతో చర్చలు జరిపే ఎలాంటి ప్రక్రియనూ ప్రభుత్వం ప్రారంభించకపోవడం పొరబాటు.
      ఎ.పి రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడిండ్‌ కేసును సుప్రీం కోర్టు కొట్టివేయడంతో భూములు కొన్న పెద్దలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పు గనక దీనిపై తదుపరి న్యాయ పోరాటానికి ఆస్కారం వుండదు. టిడిపి పెద్దలు, మంత్రులు, వారికి కావలసినవారు ముందస్తు సమాచారంతో రాజధాని భూములను కొనేసి రైతులకు నష్టం కలిగించారని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ ప్రతిపక్ష నేతగా వున్నప్పటి నుంచి ఆరోపణ చేస్తూనే వున్నారు. ఈ క్రమంలోనే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పదాన్ని తీసుకొచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభ లోనే భూములు కొంటే తప్పేముందని సమర్థించారు. స్టాక్‌మార్కెట్‌కు సంబంధించిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఇక్కడ ఎలా వర్తిస్తుందని కూడా అప్పుడే ఆయన వాదించారు. సుప్రీం తీర్పు ఇంచుమించు అలాగే వుంది. అమరావతిలో భూములను బడా బాబులు, రియల్టర్లు ముందస్తుగా కొనుగోలు చేశారనే దాంట్లో సందేహమేమీ లేదు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని వస్తుందనేది చెప్పుకుంటూనే వున్నా ఖచ్చితంగా ఎక్కడ వస్తుంది, ఎక్కడ కీలకమైన నిర్మాణాలు వస్తాయనేది ప్రభుత్వంలో ఉన్నత వర్గాలకు మాత్రమే తెలుసు. మంత్రులు, శాసనసభ్యులు చాలామంది రిజిస్ట్రేషన్లకు ముందేే కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు. 2020 తర్వాత జగన్‌ ప్రభుత్వం దీనిపై తీవ్రంగా కేంద్రీకరించింది. అప్పటి కొనుగోళ్లను విచారించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. 'సిట్‌' ఏర్పాటు చేసింది. రాజకీయ విమర్శలు ఏమైనా ఈ వ్యవస్థలో చట్టపరంగా ఆ కొనుగోళ్లు నేరం కాదనే భావన నిపుణులు వ్యక్తం చేస్తూ వచ్చారు. అందుకు తగినట్టే హైకోర్టు ఇన్‌సైడర్‌ ఆరోపణలను కొట్టివేసింది. మరోవైపున ప్రభుత్వం మాజీ ఎ.జి దమ్మాలపాటి శ్రీనివాస్‌ భూమి కొనుగోళ్లు, వాటిని న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ కుటుంబ సభ్యులు తర్వాత కొనడంపైనా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. రాష్ట్ర హైకోర్టు ఆ విచారణ నిలుపు చేస్తూ ఎఫ్‌ఐఆర్‌ వివరాలు ప్రచురించరాదని ఆంక్షలు పెట్టింది. ముఖ్యమంత్రి జగన్‌ హైకోర్టు పైన ఫిర్యాదులతో పాటు జస్టిస్‌ రమణపై ఆరోపణలతో అప్పటి సిజెఐ ఎస్‌.ఎ.బాబ్డే కు లేఖ రాయడం పెద్ద చర్చకు దారితీసింది.
                                                           సుప్రీం కోర్టు ఏం చెప్పింది ?
    ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణను కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును, మాజీ ఎ.జి కేసులో ఆంక్షలనూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుప్రీంకోర్టు వార్తల ప్రచురణపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేసు విచారణ కొనసాగించింది. ఇప్పుడు జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి ధర్మాసనం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ భావనను తోసిపుచ్చింది. దీనిపై ప్రభుత్వం తరపున దుష్యంత్‌ దవే, మెహపూజ్‌ నజ్కి వాదించారు. ప్రతివాదుల తరపున శ్యాం దివాన్‌, పరాస్‌ కుహాడ్‌, సిద్ధార్థ లూద్రా వాదించారు. ఏదైనా భూమిని కొనుగోలు చేసేప్పుడు అమ్మేవారికి పూర్తి సమాచారం ఇవ్వాలని గతంలో చాలా తీర్పులున్నాయని దవే వాదించారు. రాజధాని వస్తుందని దానివల్ల చాలా లాభం కలుగుతుందని చెప్పకుండా ప్రభుత్వ పెద్దలు భూమిని తక్కువకు కొని లాభాలు పొందారని ఆరోపించారు. అయితే 14 గ్రామాలలో 50 వేల ఎకరాలకు రాజధాని వర్తిస్తుందనే సమాచారం పత్రికలలో విస్తారంగా ప్రచురితమైందనీ, ఆస్తి బదలాయింపు చట్టం ప్రకారం ఆ విషయం ముందే చెప్పాల్సిన పనేమి లేదని శ్యాం దివాన్‌ వాదించారు. ముందస్తుగా అమ్మకందార్లకు కొనుగోలుదార్లు చెప్పాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. 2014లో ఈ లావాదేవీలు జరిగితే అమ్మకందారుల నుంచి నష్టపోయినట్టు ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఆరేళ్ల తర్వాత 2020లో కేసులు వేయాల్సిన అవసరమేమిటని ప్రశ్నించింది. హైకోర్టు అన్నీ సాకల్యంగా పరిశీలించాకే తీర్పునిచ్చిందని, తాము జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. స్టాక్‌మార్కెట్‌లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు వర్తించే ఐపిసి 420 గాని, 218, ఆస్తి బదలాయింపు 55 సెక్షన్లు గాని వర్తించవని ప్రకటించింది. వాస్తవానికి జస్టిస్‌ రమణను ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేసే ముందు ఆయనపై ఆరోపణలను అంతర్గత విచారణలో కొట్టివేసినప్పుడే సుప్రీంకోర్టు వైఖరి విదితమైందని చెప్పొచ్చు.
     ఇంకా విచారణ జరుగుతున్న మాజీ ఎ.జి కేసులో రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌ ఉపసంహరించుకుని హైకోర్టులోనే విచారణ పూర్తిచేయాలని కోరింది. అక్కడ నెల రోజులలోగా విచారణ పూర్తిచేయాలని సుప్రీం కోర్టు సూచించింది. ఇప్పటికీ అసైన్డ్‌ భూముల కొనుగోలుపై సిఐడి విడిగా దర్యాప్తు జరుపుతున్నది. పైకేసుల్లో ఎవరూ ఫిర్యాదు చేయలేదని వచ్చిన వ్యాఖ్యల దృష్ట్యా ఆ కేసులో ఎంఎల్‌ఎ ఆళ్ల రామకృష్ణా రెడ్డి ద్వారా ఫిర్యాదులు తీసుకున్నారు. వాటి భవితవ్యం కూడా అంతిమంగా న్యాయస్థానాలలోనే తేలాల్సి వుంటుంది.
 
                                                    జగన్‌ వైఖరితో రాజధాని సంక్షోభం
    సుప్రీంకోర్టు తీర్పు ముఖ్య ఘట్టమైనా ఇంతటితోనే రాజధాని రాజకీయ వివాదాలు సమసిపోతాయని చెప్పడానికి లేదు. ఈ తీర్పు ఊహించిందే అన్నట్టుగా వైసిపి వర్గాలు వ్యాఖ్యానిస్తుంటే టిడిపి వర్గాలు ఎదురుదాడి పెంచాయి. భూముల కొనుగోళ్లలో అక్రమాలే జరగలేదన్న టిడిపి వాదన వాస్తవాలతో పొసిగేది కాదు. ప్రజాశక్తి ఆ రోజుల్లో భూలావాదేవీలను ఆధారాలతో అనేక పరిశోధనాత్మక కథనాలు ప్రచురించింది. వాస్తవానికి రిజిస్ట్రేషన్ల తాకిడి ఎక్కువై నిలుపు చేయాల్సి వచ్చింది. సమస్యే లేకపోతే అప్పుడు చంద్రబాబు సమర్థించడం గాని, ఇప్పుడు కోర్టులు తీర్పులు ఇవ్వడంగాని అవసరమే వుండేది కాదు. బడా కొనుగోలుదార్లు ఈ తీర్పును చట్టపరమైన ఉపశమనంగా భావించడం వేరు, ఇదేదో నిజాయితీకి నిరూపణగా చూపుకోవడం వేరు. కొనుగోళ్లలో అక్రమాలకు ఆధారంగా రికార్డులు చూపించాలని టిడిపి నేతలు అంటుంటే రెవెన్యూ రికార్డులు ముందే మటుమాయం చేశారని సర్కారు కథనం. సిఆర్‌డిఎ మాజీ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ దీనిపై సిఐడి కి ఫిర్యాదు చేసినట్టు, తనకు భద్రత కల్పించాల్సిందిగా కోరినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయంలో స్థానిక రైతుల నుంచి ఫిర్యాదులు లేవన్న సుప్రీం కోర్టు వ్యాఖ్య వాస్తవమే. అందుకు జగన్‌ ప్రభుత్వ వైఖరి ఒక ప్రధాన కారణం. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ప్రచారంతో కల్పించిన భ్రమల కారణంగా మొదట్లో భూములు కొన్నవారికి లాభం కలిగినా తర్వాత అమరావతి నిర్మాణం నత్తనడకతో రేట్లు పడిపోయాయి. కొత్త ముఖ్యమంత్రి నుంచి మూడు రాజధానుల ప్రకటన రావడంతో ఆర్థిక కార్యకలాపాలే స్తంభించిపోయాయి. అసలే రాజధానిని ఎత్తివేస్తామనడం తీవ్ర సంక్షోభానికి దారితీసింది. ఈ పరిస్థితిలో గతం తిరగదోడటానికి రైతులు ముందుకు రావడమనే ప్రసక్తి లేకుండా పోయింది. ఏది ఏమైనా ఈ కొనుగోళ్లను కారణంగా చూపి రాజధానిని మార్చడం తర్కబద్దం కాదు. ఇప్పుడు హైకోర్టు ముందు వున్న మూడు రాజధానుల చట్టం విచారణ ఆగష్టులో మొదటి నుంచి మళ్లీ ప్రారంభం కావలసి వుంది. హైకోర్టు విచారణ తర్వాత ఎలాంటి తీర్పు వచ్చినా అవతలి పక్షం సుప్రీంను ఆశ్రయించే అవకాశం వుంటుంది గనక ఈ ఏడాది ఆ విచారణలతో గడచిపోవచ్చు. ఈలోగా ఆందోళన చేస్తున్న రైతులతో స్థానికులతో చర్చలు జరిపే ఎలాంటి ప్రక్రియనూ ప్రభుత్వం ప్రారంభించకపోవడం పొరబాటు. కౌలు, పెన్షన్ల చెల్లింపులు కూడా సకాలంలో జరగలేదు. తను అనుకున్నది చేసుకుపోవడం తప్ప ఈ సమస్యలపై స్పందించాలన్న ఆలోచన జగన్‌ సర్కారులో కనిపించడం లేదు. పాలనా రాజధాని ఏర్పాటు చేస్తామన్న విశాఖలో ఇప్పటికే భూముల గోల్‌మాల్‌కు సంబంధించిన ఫిర్యాదులు అనేకం వస్తున్నాయి. వీటిపై పారదర్శకంగానూ త్వరగానూ చర్యలు తీసుకొని విశాఖ భూములకు, నివసించేవారికి రక్షణ కల్పించవలసి వుంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు విషయమై ఎలాంటి పురోగతి లేదుగాని మానవ హక్కుల సంఘాన్ని, మరో ట్రిబ్యునల్‌ను అక్కడ ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
 
                                                       మోడీ సర్కార్‌ దాగుడుమూతలు
    రాజధాని సమస్యపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దాగుడుమూతలు మరింత విడ్డూరంగా వున్నాయి. ఎ.పి కి రాజధాని ఏదో తెలియదని సహ చట్టం కింద కేంద్ర హోం శాఖ సమాధానమిచ్చింది. తర్వాత రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ అభీష్టమని, శాసనసభ మూడు రాజధానుల చట్టం చేసిందని సవరించి జవాబిచ్చింది. ఎ.పి రాజధానికి ఉద్దేశించిన వర్తమానాలు హైదరాబాద్‌ చిరునామాకు పంపించడం మొదలుపెట్టింది. వీటిపై విమర్శలు వచ్చాక మూడు రాజధానుల చట్టం కోర్టులో వుందని మరోసారి స్పష్టం చేసింది. ఇది పెద్ద విజయంగా టిడిపి వర్గాలు చెబుతుంటే విశాఖ తరలింపునకు కేంద్రం ఆశీస్సులు వున్నాయని వైసిపి ప్రభుత్వం అంటోంది. ఒకప్పుడు అదేపనిగా వినిపించిన సింగపూర్‌ కన్సార్టియం ఉపసంహరించుకోవడానికి కూడా కేంద్రం హామీని వెనక్కు తీసుకోవడమే కారణమని ఆ దేశ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ విధంగా బిజెపి ద్వంద్వ రాజకీయం నడిపిస్తుంటే ఆ పార్టీకి చెందిన కొందరు అమరావతి రక్షకులలా రాజకీయం సాగిస్తున్నారు. టిడిపి వారిలో కొందరికి జెఎసి పదవులు కూడా అప్పగించింది. అమరావతి సమస్యలపై మొదటి నుంచి ముందుండి పోరాడుతున్న సిపిఎం రాజధాని పోరాటానికి పూర్తి మద్దతునిస్తూనే బిజెపి ని అందులో ఎలా భాగస్వామిని చేస్తారని ప్రశ్నించడానికి ఇదే కారణం. ఎ.పి బిజెపి కమిటీ రకరకాలుగా మాట్లాడుతూ కాలం గడుపుతుంటే గతంలో గట్టిగా మాట్లాడిన జనసేనాని మౌనం దాల్చిన పరిస్థితి. ఈవిధంగా రాజధాని సమస్యపై పాలక పార్టీలు ఎవరి వ్యూహాలను బట్టి వారు రాజకీయాలు చేస్తుంటే అమరావతి ప్రాంత ప్రజల్లో అయోమయం, ఆవేదన నెలకొన్నాయి. ఇదంతా రియల్టర్ల, పెయిడ్‌ ఆర్టిస్టుల ఉద్యమంగా వైసిపి చెప్పడం పొరబాటు. జగన్‌ ప్రభుత్వ పదవీ కాలం సగం పూర్తికావస్తున్నా రాజకీయ ప్రతిష్టంభన లోనే రాష్ట్ర రాజధాని కూరుకుపోవడం, కేంద్రం అందుకు ఆజ్యం పోయడం దారుణం. అక్కడ రూ. లక్షల కోట్ల విలువైన ఆస్తి సృష్టించబడిందనేది అవాస్తవం. ఒక రాజధాని కట్టుకోవడానికి కావలసినదాన్ని మించి భూమి సమీకరించబడి వుంది. ఇప్పటికైనా వాస్తవిక దృష్టితో రాజధాని ప్రణాళికలు పూర్తి చేసి ఈ సమస్యకు తెర దించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. విభజన చట్టం చెబుతున్నట్టుగా అందుకు ఆర్థిక సహాయం చేయవలసింది కేంద్రమే. అదే సమయంలో వికేంద్రీకరణ విధానంతో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి సాధించడానికి కూడా సత్వర చర్యలు తీసుకోవలసిందే. అప్పుల తాకిడి, నదీ జలాల వివాదాలు, పోలవరం పునరావాసం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చర్యలతో సహా సమస్యల ఊబిలో చిక్కుకుపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవడం వదిలేసి రాజధాని రాజకీయాన్ని సాగదీయడం విజ్ఞత కాదు.
 
తాజా వార్తలు

Related Keywords

Kurnool ,Andhra Pradesh ,India ,Polavaram ,Vizag ,Amravati ,Maharashtra ,Guntur ,Chandra Naidu ,Supreme Court ,Cm High Court ,Heard Consortium ,Central Home The Department ,Kurnool High Court ,High Court ,Sports Amravati ,Amravati Land ,Central Home ,கர்னூல் ,ஆந்திரா பிரதேஷ் ,இந்தியா ,போலவாரம் ,விசாக் ,அமராவதி ,மகாராஷ்டிரா ,குண்டூர் ,சந்திரா நாயுடு ,உச்ச நீதிமன்றம் ,உயர் நீதிமன்றம் ,மைய வீடு ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.