సాక్షి, నేరడిగొండ(ఆదిలాబాద్): మండలంలోని సవర్గాం గ్రామానికి చెందిన నాలుగు నెలల గర్భిణి జాదవ్ సంగీత(22) శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తెను అత్తింటి వారే హత్య చేశారంటూ నేరడిగొండ జాతీయ రహదారిపై మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు రాస్తారోకో చేపట్టారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..