comparemela.com


లారెన్స్ 'అధికారమ్' ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరో.. రాఘవర్ లారెన్స్ నటించబోతున్న లేటెస్ట్ మూవీ 'అధికారమ్'. తాజాగా దీని ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తుండగా, దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. తాజాగా 'అధికారమ్' చిత్రాన్ని అఫీషియల్‌గా ప్రకటించిన చిత్ర బృందం..ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ టీజర్‌ను విడుదల చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రాఘవ లారెన్స్ చాలా వైలెంట్‌గా కనిపిస్తున్నాడు. రక్తంతో తడిసిన దుస్తుల్లో ఉన్న ఆయన.. చేతిలో కత్తి పట్టుకొని నడుచుకుంటూ వస్తున్న లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. వెట్రి మారన్ 'గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ' సమర్పణలో ఫైవ్ స్టార్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. కదిరేసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం లారెన్స్ 'రుద్రన్' అనే సినిమాలో నటిస్తున్నాడు. 

Related Keywords

Durai Senthil Kumar ,Raghav Lawrence ,National Award ,Lawrence First ,துராய் செந்தில் குமார் ,ராகவ் லாரன்ஸ் ,தேசிய விருது ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.