comparemela.com


కృష్ణా జలాలది సమస్య కాదా!
పరిష్కారానికి ఢిల్లీకి ఎందుకు వెళ్లరు?
తన బాధ్యతలను గాలికొదిలేసిన జగన్‌
చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేతల ఫైర్‌
అమరావతి, జూలై 5(ఆంధ్రజ్యోతి): â€˜â€˜à°•à±à°·à°¾à°® పీడిత రాయలసీమకు అందాల్సిన కృష్ణా జలాలు ఉత్త పుణ్యానికి సముద్రం పాలయ్యే పరిస్థితి వచ్చింది. ఇంత పెద్ద సమస్యపై ఢిల్లీ వెళ్ళే ప్రయత్నాన్ని సీఎం జగన్‌రెడ్డి ఎందుకు చేయలేదు? సొంత కేసుల మాఫీ కోసం ఢిల్లీ వెళ్ళే సీఎంకి ఇదంత ముఖ్యమైన సమస్యగా కనిపించలేదా?’’ అని టీడీపీ నిలదీసింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ ముఖ్య నేతల సమావేశం సోమవారం ఆన్‌ లైన్‌లో జరిగింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య చోటు చేసుకొన్న నదీ జలాల వివాదంపై చర్చించారు. ‘‘తమపై నిరుద్యోగులు, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించడానికి కూడబలుక్కొని, సెంటిమెంట్‌ రెచ్చగొట్టడానికి కప ట నాటకం ఆడుతున్నారు. అందుకే ఉత్తుత్తి లేఖలకు పరిమితం అయ్యారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన నదీ జలాలను, నదీ ప్రవాహానికి దిగువన ఉన్న రాష్ట్రంగా ఉన్న హక్కులను, అపెక్స్‌ కౌన్సిల్‌లో చేసుకొన్న ఉమ్మడి తీర్మానాన్ని రక్షించాల్సిన బాధ్యత జగన్‌రెడ్డి ప్రభుత్వంపై ఉంది’’ అని సమావేశం పేర్కొంది. ‘‘జల యజ్ఞంలో, ధన యజ్ఞాన్ని కప్పిపుచ్చుకోవడానికి కృష్ణా మిగులు జలాల్లో హక్కు కోరబోమని వైఎస్‌ ప్రభుత్వం బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌కు లేఖ ఇచ్చి సీమకు తీరని ద్రోహం చేసింది. 
ఇప్పుడు జగన్‌రెడ్డి శ్రీశైలంలో నీటి హక్కుల్ని కాపాడలేక చేతులెత్తేసి రాయలసీమకు మరింత ద్రోహం చేస్తున్నారు’’ అని సమావేశం విమర్శించింది. ‘‘గతంలో సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రత్యేకంగా ముఖ్యమంత్రుల కమిటీ వేయించి ఆలమట్టి డ్యాం ఎత్తు పెరగకుండా ఆపగలిగారు. రాష్ట్ర విభజన తర్వాత సీఎంగా ఉన్న సమయంలో కేఆర్‌ఎంబీ కార్యాలయాన్ని విజయవాడకు తరలించడానికి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదం తీసుకొన్నారు. తెలంగాణ కూడా ఆమోదించింది. జగన్‌రెడ్డి ప్రభుత్వం దానిని వేరే చోటకు తరలించాలని ప్రయత్నించడంతో అది హైదరాబాద్‌లోనే ఉండిపోయింది. ఏపీ ఫిర్యాదులను కేఆర్‌ఎంబీ పట్టించుకోవడం లేదని, తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తోందని జగన్‌రెడ్డి ఇప్పుడు లేఖలు రాస్తున్నారు. అది విజయవాడలో ఉండి ఉంటే ఈ దుస్థితి వచ్చి ఉండేదా? దానికి కారణం ఈ సీఎం కాదా!’’ అని టీడీపీ నేతల సమావేశం ప్రశ్నించింది. కృష్ణా జలాల వివాదంపై తక్షణం అఖిలపక్ష బృందాన్ని ప్రధాని, జలశక్తి మంత్రి వద్దకు తీసుకువెళ్ళాలని, ముచ్చుమర్రి పెండింగ్‌ పనులను పూర్తి చేసి రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులకు నీరు ఇవ్వాలని సమావేశం డిమాండ్‌ చేసింది. 
లేటరైట్‌ కుంభకోణంపై చర్య తీసుకోవాలి
తూర్పు గోదావరి, విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో లేటరైట్‌ పేరుతో బాక్సైట్‌ అక్రమ తవ్వకాల కోసం అటవీ చట్టాలను ఉల్లంఘించి అధికార దుర్వినియోగానికి పాల్పడిన వైవీ సుబ్బారెడ్డి కుమారుడు, ఇతర వైసీపీ నేతలపై తక్షణం చర్యలు తీసుకోవాలని టీడీపీ కోరింది. రూ.15 వేల కోట్ల మైనింగ్‌ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని కూడా డిమాండ్‌ చేసింది. సమావేశంలో అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

Related Keywords

East Godavari ,Andhra Pradesh ,India ,Delhi ,New Delhi ,Vizag ,Amravati ,Maharashtra ,Rayalaseema Andal Krishna ,Office Vijayawada ,Issue Delhi ,Prime Minister ,Channel Somebody ,கிழக்கு கோதாவரி ,ஆந்திரா பிரதேஷ் ,இந்தியா ,டெல்ஹி ,புதியது டெல்ஹி ,விசாக் ,அமராவதி ,மகாராஷ்டிரா ,ப்ரைம் அமைச்சர் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.