సాక్షి, కెలమంగలం(బెంగళూరు): తాగుబోతు కొడుకుపెట్టే హింసలను భరించలేక తండ్రే మద్యంలో పురుగుల మందు ఇచ్చి హత్య చేసిన ఘోరం రాయకోట వద్ద జరిగింది. రాయకోట సమీపంలోని మేల్నోకియూరు గ్రామానికి చెందిన రాజ (41). ఇతని కొడుకు లోకేష్ (25). లోకేష్ తాగుడు అలవాటును తట్టుకోలేక ఇద్దరు భార్యలు విడిచిపెట్టగా, మూడో భార్య కొడియా ఇంట్లో ఉంది. అతని గొడవను భరించలేక ఆమె కూడా ఇటీవల పుట్టింటికి