comparemela.com


ఖేల్‌రత్నకు జ్యోతి సురేఖ, మిథాలీ
క్రీడా సంఘాల ప్రతిపాదన
కోల్‌కతా: క్రీడల్లో అత్యున్నత పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్నకు తెలుగమ్మాయి, యువ ఆర్చర్‌ జ్యోతి సురేఖ పేరును జాతీయ ఆర్చరీ సంఘం (ఏఏఐ) ప్రతిపాదించింది. రెండేళ్లక్రితం ప్రపంచ చాంపియన్‌షి్‌పలో రెండు కాంస్యాలతో పాటు అనేక అంతర్జాతీయ పతకాలు సాధించిన 24 ఏళ్ల జ్యోతి సురేఖ.. 2017లోనే అర్జున అవార్డు సొంతం చేసుకుంది. ఇక.. క్రికెట్‌ తరఫున మిథాలీ రాజ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ పేర్లను ఖేల్‌రత్నకు నామినేట్‌ చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. శిఖర్‌ ధవన్‌, కేఎల్‌ రాహుల్‌, బుమ్రాను అర్జున అవార్డుకు క్రికెట్‌ బోర్డు ప్రతిపాదించింది. వీరితో పాటు పలు జాతీయ క్రీడా సంఘాలు తమ ఆటగాళ్ల పేర్లను వివిధ క్రీడా అవార్డులకు నామినేట్‌ చేశాయి. క్రీడా అవార్డులకు నామినేట్‌ చేసేందుకు జూలై 5 చివరి తేదీ.
క్రీడా అవార్డులకు నామినేట్‌ అయిన మిగతా ఆటగాళ్ల వివరాలు:
ఖేల్‌రత్న- శరత్‌ కమల్‌ (టీటీ), నీరజ్‌ చోప్రా (అథ్లెటిక్స్‌), సునీల్‌ ఛెత్రి (ఫుట్‌బాల్‌), అంజుమ్‌ మోద్గిల్‌, అంకుర్‌ మిట్టల్‌ (షూటింగ్‌), శుభాంకర్‌ శర్మ (గోల్ఫ్‌).
అర్జున - బాలా దేవి (ఫుట్‌బాల్‌), సుతీర్థ ముఖర్జీ, ఐహికా ముఖర్జీ, మానవ్‌ టక్కర్‌ (టీటీ), ఎలవెనిల్‌ వలరివన్‌, అభిషేక్‌ వర్మ (షూటింగ్‌).

Related Keywords

Bala Devi , ,Arjuna Award ,Arjuna Bala Devi ,பாலா தேவி ,அர்ஜுனா விருது ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.