భారతదేశ చరిత్రలో స్వాతంత్య్ర పోరాటం ఒక వీరగాథ. ఈ వీరగాథకు తాము మాత్రమే గుత్తాధిపతులమని కాంగ్రెసు చెప్పుకోజాలదు. కాంగ్రెసు తోనూ, దాని వ్యూహరచన తోనూ అసంతృప్తి చెందిన కమ్యునిస్టులు, రకరకాల సోషలిస్టులు కాంగ్రెసుతో సమానంగా కృతనిశ్చయంతో, బలిదానాలతో పోరాడారు. అయితే, ఆనాడు వెల్లివిరిసిన దేశభక్తికి ఒకే ఒక్క మినహాయింపు ఉన్నది. అది ఆర్‌ఎస్‌ఎస్. ఆర్‌ఎస్‌ఎస్ దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటంలో పాల్గొనలేదు.