అగనంపూడి(గాజువాక)/ఉక్కునగరం(గాజువాక): ఆంధ్రుల మనోభావాలను లెక్క చేయకుండా కేంద్రం విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో ముందుకు వెళ్తే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హెచ్చరించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సారధ్యంలో అగనంపూడి నుంచి అక్కిరెడ్డిపాలెం వరకు జరిగిన పది కిలోమీటర్ల మానవహారం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.