సాక్షి, హైదరాబాద్: పలు జాతీయ, అంతర్జాతీయ కార్టూన్, క్యారికేచర్ పోటీల్లో అనేక బహుమతులు సాధించిన సాక్షి కార్టూనిస్ట్ శంకర్ ఖాతాలో మరో రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులు చేరాయి. పోర్చుగీస్ ప్రింటింగ్‌ప్రెస్ ప్రతియేటా నిర్వహించే 23వ పోర్టో కార్టూన్ వరల్డ్ ఫెస్టివల్‌లో శంకర్ వేసిన రెండు చిత్రాలు ప్రథమ, ద్వితీయ బహుమతులకు ఎంపికయ్యాయి. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత