న్యూఢిల్లీ: గ్రూప్ 7(జీ 7) దేశాలకు భారత్ సహజ మిత్రదేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నిరంకుశవాదం, తప్పుడు సమాచారం, ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం, ఆర్థికపరమైన ఒత్తిడి.. తదితరాల నుంచి ఉద్భవించే సవాళ్ల నుంచి సభ్యదేశాల భాగస్వామ్య విలువలను రక్షించుకునే దిశగా భారత్ తన కృషిని కొనసాగిస్తుందన్నారు. ‘జీ 7’ సదస్సులో ‘ఓపెన్ సొసైటీస్ అండ్ ఓపెన్ ఎకానమీస్’ అంశంపై ప్రధాని