comparemela.com


హైదరాబాద్‌లో ఐదుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్: నగరంలోని వెస్ట్‌జోన్ మంఘల్ హాట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఐదుగురు పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. మంఘాళ్‌హాట్ à°ªà±‹à°²à±€à°¸à±â€Œà°¸à±à°Ÿà±‡à°·à°¨à± ఎస్సై వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ మురళి, ఈమనెల్, పోలీస్ కానిస్టేబుల్స్ రవి కిరణ్, జానకిరామ్ సస్పెండ్ వేటుకు గురయ్యారు. గతంలో మంఘాళ్‌హాట్‌లో పేకాట స్థావరంపై దాడులు జరిపి రూ.2.50 లక్షలకు పైగా నగదు లభించగా అందులో సీజ్ చేసిన నగదును మంఘల్‌హాట్ పోలీసులు గోల్‌మాల్ చేశారు. దీంతో ఈ వ్యవహారంపై ఎస్‌‌బీ విచారణకు సీపీ ఆదేశించారు. ఎస్‌బీ విచారణలో నగదు గోల్‌మాల్ జరిగినట్లు నిర్థారణ అయ్యింది. దీంతో మంఘాళ్‌హాట్ పోలీసులపై సీపీ సస్పెన్షన్ వేటు వేశారు. 

Related Keywords

Hyderabad ,Andhra Pradesh ,India ,Ravi Kiran ,Essai Venkateswarlu , ,Commissioner Kumar ,Head Constable Murali ,ஹைதராபாத் ,ஆந்திரா பிரதேஷ் ,இந்தியா ,ரவி கிறன் ,ஆணையர் குமார் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.