హైదరాబాద్: జీవో నంబర్ 111 అంశానికి సంబంధించి ప్రభుత్వ పనితీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విచారణ చేపట్టి నాలుగేళ్లయినా ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వడం లేదని హైకోర్టు నిలదీసింది. ఈ జీవోపై గురువారం విచారణ సందర్భంగా.. అసలు నివేదిక జాప్యం వెనక రహస్య అజెండా ఏంటని సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ వి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం