comparemela.com


'మహా' టీజర్ రిలీజ్
సౌత్ స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ నటించి చిత్రం 'మహా'. తాజాగా ఈ చిత టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. డెబ్యూ డైరెక్టర్ యుఆర్ జమీల్ దర్శకత్వంలో రూపొందిన 'మహా' హన్సిక మైల్ స్టోన్ మూవీ 50వది కావడం విశేషం. సిలంబరసన్, శ్రీకాంత్, సనమ్ శెట్టి, తంబి రామయ్య, కరుణకరన్, మహాత్ రాఘవేంద్ర, సుజిత్ శంకర్, నందిత జెన్నిఫర్ కీలక పాత్రల్లో నటించారు. హీరో శివకార్తికేయన్ టీజర్‌ను రిలీజ్ చేసి, సినిమా మంచి విజయాన్ని సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఇక 'మహా' సినిమాను సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కినట్టు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇందులో హన్సిక - శింబుతో జంటగా నటించారు. గత ఏడాదే విడుదల కావాల్సి ఈ సినిమా కరోనావైరస్ కారణంగా వాయిదా పడింది. అయితే ఓటీటీలో విడుదల చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. కానీ మేకర్స్ నుంచి మాత్రం దీనికి సంబంధించిన ఎలాంటి కన్‌ఫర్మేషన్ రాలేదు. ఈ సినిమాని ఎట్సెటెరా ఎంటర్టైన్మెంట్ పతాకంపై మతి అజగన్ నిర్మించారు. 

Related Keywords

Sanam Shetty ,Sujit Shankar , ,Hansika Mile Stone Movie ,Crime Thriller ,சனம் ஷெட்டி ,சுஜித் ஷங்கர் ,குற்றம் த்ரில்லர் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.