సాక్షి, మద్దిరాల(నల్లగొండ): పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధి లోని జి.కొత్తపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గురువారం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన నిమ్మ సుధాకర్ మేరమ్మ దంపతులు తరచూ గొడవ పడుతున్నారు. దీంతో వారి కుమార్తె నిమ్మ రూప(18)మనస్థాపానికి గురై బుధవారం రాత్రి పురుగుల మందు తాగింది.