సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 50 ఏళ్ల క్రితం మరణించగా సంబంధిత వ్యక్తి వారసులు ఆయన మరణ ధ్రువీకరణ పత్రం కోసం రెవెన్యూ, పంచాయతీ కార్యాలయాల్లో సంప్రదించగా అధికారులు రికార్డుల్లో లేదని తెలిపారు. దీంతో వారసులు ఓ ఇంటర్‌నెట్ సెంటర్ నిర్వాహకుడి సహాయంతో రూ.1,000 చెల్లించి విజయనగరం జిల్లాలోని ఓ పీహెచ్‌సీ రికార్డుల్లో నమోదైనట్లుగా మరణ ధ్రువీకరణ పత్రాన్ని