కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి సాగు చట్టాలకు వ్యతిరేకంగా గుంటూరులో జరిగిన సెమినార్‌లో తీర్మానాలు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల పిలుపు మేరకు వచ్చే నెల 25న జరగనున్న భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని గుంటూరులో ఆదివారం రాష్ట్ర కౌలు రైతు సంఘం ఆధ్యర్యంలో జరిగిన జాతీయ సెమినార్ పిలుపునిచ్చింది. తీర్మానాలను ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ప్రతిపాదించారు.