comparemela.com


HYD: రెండు వారాల్లోనే దంచేశాయ్‌
సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతాలు (ఎక్కువ: నీలం రంగు, అతిఎక్కువ: ముదురు నీలం)
ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ఈ ఏడాది జులైలోనే రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. వానాకాలం మొత్తం కురియాల్సిన వానలు కేవలం రెండు వారాల్లోనే దంచికొట్టాయి. దీంతో గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. పక్షం రోజుల వ్యవధిలో 25 సెం.మీ. నుంచి 40 సెం.మీ. వాన పడింది. ఆల్‌టైమ్‌ రికార్డు 42.2 సెం.మీ. వాన 1989లో నమోదైంది. ఇటీవల వానలతో సగటున గ్రేటర్‌లో 20 సెం.మీ.పైన వర్షం పడింది. నగరంలో జూన్‌, జులైలో సాధారణ వర్షపాతం 276.5 మి.మీ. కాగా.. రంగారెడ్డిలో 244.7 మి.మీ., మేడ్చల్‌ జిల్లాలో 287.6 మి.మీ.గా ఉంది. నెల ముగిసేందుకు ఇంకా వారం రోజులు మిగిలి ఉండగానే ఆయా జిల్లాల పరిధిలోని చాలా ప్రాంతాల్లో 400 మి.మీ.పైన వర్షపాతం నమోదైంది.
రెండు నెలల్లో 400 మి.మీ.పైన వానలు పడిన ప్రాంతాలు
 హయత్‌నగర్‌, సరూర్‌నగర్‌, ఉప్పల్‌, కాప్రా, బాలానగర్‌, మల్కాజిగిరి, మారేడుపల్లి, ముషీరాబాద్‌, అసిఫ్‌నగర్‌
251 - 400 మి.మీ. మధ్యలో..
● కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, షేక్‌పేట, గోల్కొండ, ఖైరతాబాద్‌, హిమాయత్‌నగర్‌, నాంపల్లి, అంబర్‌పేట, సైదాబాద్‌, బహుదూర్‌పుర, రాజేంద్రనగర్‌, బండ్లగూడ, చార్మినార్‌
అతి ఎక్కువగా నమోదైన ప్రాంతాలు (60 శాతం అధికం)
● పటాన్‌చెరు, కూకట్‌పల్లి, బాలానగర్‌, అంబర్‌పేట, ఖైరతాబాద్‌, షేక్‌పేట, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, ముషీరాబాద్‌, కాప్రా, ఉప్పల్‌, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌, చార్మినార్‌, సైదరాబాద్‌, నాంపల్లి
ఎక్కువగా ( 20-59 శాతం అధికం)
● రాజేంద్రనగర్‌, బండ్లగూడ, బహుదూర్‌పుర, గోల్కొండ, హిమాయత్‌నగర్‌, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, అల్వాల్‌.
Tags :
మరిన్ని

Related Keywords

Kapra ,Andhra Pradesh ,India , ,கப்ரா ,ஆந்திரா பிரதேஷ் ,இந்தியா ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.